Prashant Bhushan | Letter | Kejriwal

Prashanth bhushan s said god and history won t forgive you in a letter to kejriwal

prashanth, bhushan, aap, kejriwal, letter, elections, delhi, yogender

Prashant Bhushan is a famous lawyer-activist whose public interest litigations have helped expose major scams. He is a founding member of the Aam Aadmi Party. But After expelled from the party's top decision-making fora, Prashant Bhushan and Yogendra Yadav were looking in a rebellion mood

కేజ్రీవాల్.. ఆ దేవుడు, చరిత్ర నిన్ను క్షమించదు

Posted: 04/04/2015 11:32 AM IST
Prashanth bhushan s said god and history won t forgive you in a letter to kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం గురించి అందరికి తెలుసు. చిలికిచిలికి గాలి వానలా అంతకంతకూ పెరిగిన ఆప్ వివాదం చివరకు పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వారిని, మేధావులను దూరం చేసుకుంది. పార్టీలో కేవలం ఒకరి మాట మాత్రమే చెల్లుబాటు అవుతోందని, పార్టీ సిద్దాంతాలకు విరుద్దంగా పని చేస్తున్నారంటూ కేజ్రీవాల్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ నుండి కొంత మందిని సాగనంపుతూ నిర్ణయం తీసుకోగా, మిగతా వారు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసిగి బయటకు వెళ్లారు. అయితే పార్టీలో జరిగిన ఘటనలు, కేజ్రీవాల్ ప్రవర్తన గురించి పార్టీ సినియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ బహిరంగ లేఖ రాశారు. అందులో కేజ్రీవాల్  వైఖరిని ఎండగట్టారు ప్రశాంత్ భూషణ్.

ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన తరువాత ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తరువాత ప్రశాంత్ భూషణ్ దాని గురించి హెచ్చరించినట్లు లేఖ లో వెల్లడించారు. అయితే పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న తనపై, యోగేంద్ర యాదవ్ ల వాదన కూడా వినకుండానే తొలగించడం పై ఏం వివరణ ఇచ్చుకుంటారని ప్రశాంత్ భూషన్ ప్రశ్నించారు. పార్టీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏకంగా బౌన్సర్ లను తీసుకువచ్చారని ఆరోపించారు. అంతేకాక ఎమ్మెల్యేలు కూడా కాస్త ఎక్కువగానే స్పందించారని అన్నారు. అంతేకాకుండా పార్టీ మీటింగ్ లో తమకు మాట్లాడే అవకాశం లేకుండా చేసి, చర్చలేకుండానే తమపై వేటు వేశారని ప్రశాంత్ భూషన్ ఆరోపించారు. మీటింగ్ లో కేజ్రీవాల్ ప్రసంగంలో కొంత భాగాన్ని మాత్రమే ప్రసారం చేశారని, మిగిలిన ప్రసంగాన్ని ఎంతో నేర్పుగా ప్రసారం చెయ్యలేదని అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో ఢిల్లీని పాలించి అవినీతి లేకుండా చెయ్యాలని ఆశిస్తున్నానని ప్రశాంత్ ఆకాంక్షించారు. మొత్తానికి లేఖలో కే్జ్రీవాల్ పై బాంబులు పేల్చిన ప్రశాంత్ భూషణ్ చివర్లో మాత్రం కేజ్రీవాల్, ఆప్ కు గుడ్ లక్ అండ్ గుడ్ బాయ్ అని చెప్పేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prashanth  bhushan  aap  kejriwal  letter  elections  delhi  yogender  

Other Articles