renikuntla ellaiah special story | inter caste marriages

Renikuntla ellaiah special story who making inter caste marriages

renikuntla ellaiah news, renikuntla ellaiah special story, inter cast marriage, honor killing incidents, dowry cases, cast elimination, renikuntla ellaiah history

renikuntla ellaiah special story who making inter caste marriages : A special story on renikuntla ellaiah who is making intercast marriages of lovers. He already done 2000 marriages.

ప్రేమికులకు పెద్దన్నగా మారిన ‘పెళ్లిళ్ల ఎల్లయ్య’

Posted: 04/04/2015 11:43 AM IST
Renikuntla ellaiah special story who making inter caste marriages

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ‘మనసుకు నచ్చినవారితో వివాహం చేసుకుంటే జీవితాంతం సుఖంగా వుండవచ్చు’ అని నేటితరం యువతీయువకులు పాటించే సూత్రం! అందుకే కుల, మత, జాతి వంటి బేధాలేమీ పట్టించుకోకుండా ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటారు. అయితే.. ఇటువంటి కులాంతర వివాహాలను కొందరు తల్లిదండ్రులు ఒప్పుకుంటే.. మరికొందరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో జంటలకు ఏం చేయాలో తోచక కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి వారికి పెద్దన్నగా మారాడు రేణుకుంట్ల ఎల్లయ్య.

వరకట్న నిషేధం, కులనిర్మూలన ధ్యేయంగా ముందుగా సాగుతున్న ఎల్లయ్య.. ఇప్పటికే కొన్ని వేల జంటలకు వివాహాలు చేశారు. కులాంతర వివాహాలను కుటుంబసభ్యులు ఒప్పుకోని ప్రేమజంటలకు ఈయన అండగా నిలుస్తూ.. వారికి వివాహాలు జరిపిస్తున్నాడు. అలాగే.. కులాంతర వివాహాలు చేసుకుని పెద్దల నుంచి సహాయ సహకారాలు లేక ఇబ్బంది పడుతున్న జంటలకు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే ఆర్థిక సహాయం అందేలా చేస్తున్నాడు. వారికి ఉపాధి అవకాశాలనూ కల్పించి చేయూతనందిస్తున్నాడు. అంతేకాదు.. తల్లిదండ్రుల్లో ఎవరైనా జైల్లో ఉంటే ప్రభుత్వ అనుమతితో పెరోల్‌పై వారిని బయటికి రప్పించి.. వాళ్ల పిల్లలకు వివాహాలు చేయిస్తున్నాడు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి, అంధులు, అనాథలకు అన్నీ తానై పెళ్లిళ్లు జరిపిస్తున్నాడు.

ఇదిలావుండగా.. హిందుస్తాన్ కేబుల్ లిమిటెడ్‌లో కొంతకాలం పనిచేసిన రేణుకుంట్ల ఎల్లయ్య.. 2001లో వీఆర్‌ఎస్ (వ్యాలెంటరీ రిటైర్ మెంట్ స్కీమ్) తీసుకున్నాడు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్, కాన్షీరాం ఆశయాలను, సిద్ధాంతాలను నమ్మిన ఈయన.. కుల నిర్మూలన, వరకట్ననిషేధం లక్ష్యంగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 1991 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత ఐక్య వేదిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కులాంతర, మతాంతరం వివాహలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఇప్పుడు మరో వంద జంటలను ఒక్కటి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఆదివారం వారిని కలపనున్న ఈయన.. ఇప్పటికే అన్ని ఏర్పాటు సిద్ధం చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renikuntla ellaiah  inter cast marriages  

Other Articles