telangana cm kcr special plans on ghmc elections | trs party minister

Telangana cm kcr special plans on ghmc elections

cm kcr news, cm kcr press meet, cm kcr cabinet meeting, kcr meeting, kcr party meeting, trs party meeting, trs party minister, trs ministers, ghmc elections, ghmc elections places, hyderabad city, telangana state, hyderabad court, andhra pradesh high court, telangana high court

telangana cm kcr special plans on ghmc elections : Cm Kcr Making Special plans on ghmc elections to win. According to sources he already given instructions to ministers about this elections.

GHMC ఎన్నికలపై కసరత్తు.. కేసీఆర్ ‘బాద్ షా’గా నిలుస్తారా?

Posted: 04/04/2015 11:14 AM IST
Telangana cm kcr special plans on ghmc elections

ఇటీవలే హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ GHMC ఎన్నికలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తమకు 249 రోజుల గడవు కావాలంటూ టీ-సర్కార్ పిటీషన్ లో పేర్కొనగా.. అంత సమయం ఇచ్చేందుకు వీలుకాదని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే! దీంతో ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించే దిశగా టీ-ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోందని తెలిసింది.

ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. నిన్నటివరకు ఈ విషయంపై నోరుమెదపని ఆయన.. ఇప్పుడు చకచకా పనులు కానిచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రూపంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిన నేపథ్యంలో.. ఈసారి జరగబోయే GHMC ఎలక్షన్లో ఎట్టిపరిస్థితుల్లోనైనా గెలుపొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే మంత్రులను అలర్ట్ చేశారని, కొందరు మంత్రులకు పలు ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. ముందునుంచి హైదరాబాద్ పై పట్టులేని టీఆర్ఎస్.. కనీసం ఈ ఎన్నికల తర్వాతైనా పాగా వేయాలని యోచిస్తోంది. మరి.. కేసీఆర్ అనుకున్నట్లుగా ఈ ఎన్నికల్లో ‘బాద్ షా’గా నిలుస్తారో లేదో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. ఈ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు  గ్రేటర్ బాధ్యతలు అప్పగించారు. అలాగే గ్రేటర్ పరిధిలో ఐదుగురు మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ శివారు ప్రాంత నియోజకవర్గాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి పెట్టనున్నారు. ఈ ఎన్నికల కోసం మంత్రి హరీష్ రావు ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  ghmc elections  greater hyderabad  hyderabad high court  

Other Articles