పోగాకు ఉత్పత్తుల ద్వారా క్యాన్సెర్ రాదని.. కేంద్రంలోని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో బీజేపి ఎంపీ తన గళాన్ని వినిపించారు. ఇప్పటికే దిలిప్ గాంధీ, ఆ తరువాత శ్యామ్ చరణ్ గుప్తాల వ్యాఖ్యాలను సమర్థిస్తూ.. బీజేపీ అస్సాం లోక్ సభ సభ్యుడు రామ్ ప్రసాద్ శర్మ మద్దత్తు పలికారు. ధూమపానం క్యాన్సర్‌కు కారణం కాదంటూ ఆయన తన నిర్ణయాన్ని నిర్బయంగా వెలిబుచ్చారు. పోగా ఉత్పత్తుల కారణంగా కాన్సర్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ ఉత్పత్తులపై హెచ్చరికల బోమ్మలను రెట్టింపు స్థాయిలో ముద్రించాలన్న కేంద్రం ప్రభుత్వం నిర్ణయాన్ని వారు తప్పుబడుతున్నారు.
రామ్ ప్రసాద్ శర్మ తన ఇద్దరి సహచర ఎంపీ కంటే మరో అడుగు మందుకేసీ.. సారీ ముందుకేసీ.. మరీ... ప్రతిరోజు ఓ బాటిల్ మద్యం, 60 సిగరెట్లు తాగే ఇద్దరు వ్యక్తులు తనకు తెలుసునని... వారిలో ఒకరు 86 సంవత్సరాలకు చనిపోయారు. మరొకరు ఇప్పటికీ బతికే ఉన్నారని పేర్కోన్నారు. కాబట్టి పొగ తాగడం వల్ల కేనర్స్ వస్తుందనే వారు దీన్ని గమనించాలని రామ్ ప్రసాద్ శర్మ చెప్పారు.
ఈ క్రమంలో ధూమపానం కేన్సర్‌కు కారణమవుతుందని నమ్మేవారు తనుచెప్పే మాటలను పరిగణలోకి తీసుకోవాలని తాజగా తెరపైకి వచ్చిన రామ్ ప్రసాద్ శర్మ అంటున్నారు. ఈ ముగ్గురు కూడా పొగకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేందుకు తీసుకురానున్న కొత్త విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యులు కావడం గమనార్హం. వీరే ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తుంటే... ఇక పోగాకు ఉత్పత్తులు వాడకాన్ని కేంద్రం ఎలా తగ్గిస్తుందో వేచి చూడాలి మరి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more