anbumani ramadoss pulls out center over pictorial warning

Pmk mp ramadoss lashes out at center

pmk mp ramadoss lashes out at center, former union minister anbumani ramadoss cries foul, cigeratte and bedis causes cancer, 41 male and 18 female percent suffering cancer, victim of tobacco lobbying, larger pictorial warnings needed, Anbumani ramadoss, pictorial warning, victim, tobacco lobbying

NDA ally PMK party mp, former union minister anbumani ramadoss pulls out center, says should not succumb to tobacco lobby

పొగాకు లాబీలకు తలొగ్గొద్దు.. కేంద్రానికి రామదాస్ వినతి

Posted: 04/03/2015 05:20 PM IST
Pmk mp ramadoss lashes out at center

పోగాకు లాబీలకు కేంద్రం తలగ్గకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఎంపీ అన్భుమణి రామదాస్ విన్నవించారు. పోగాకు లాబీలు విషసర్పాల మాదిరిగా పొంచి వుంటూ.. కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలను చేపడతాయని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన హెచ్చరిక బోమ్మలను పోగాకు లాబీలు అడ్డుకున్నాయని చెప్పారు. అందుకే మూడు రోజుల క్రితం అమల్లోకి వచ్చినా.. ఇంకా సిగరెట్, బీడీ ఉత్పత్తులపై హెచ్చరిక బొమ్మల ముద్రణ 80 శాతానికి రాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తాను పోగాకు లాభీయింగ్ దారుల భాదితుడినని చెప్పుకోచ్చిన ఆయన తక్షణం కేంద్రం పోగాకు ఉత్పత్తులపై వున్న 40 శాతం హెచ్చరికలను 80 శాతానికి పెంచాలని సూచించారు. పోగాకు వల్ల మరణాలు లేవని అధికార పార్టీకి చెందిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యాలను అయన తోసిపుచ్చారు. పోగాకు వల్ల 41 శాతం మంది పురుషులు కాన్సర్ బారిన పడ్డారని, వీటి వల్ల దేశంలో ఇప్పటికే 84 వేల మంది పురుషులు మరణించారని ఆయన వివరించారు.

మరో విస్తుగోలిపే అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకోచ్చారు. పోగాకు ఉత్పత్తుల వల్ల కేవలం మగవారేకాదని, ఆడవారు దాని బారిన పడి ప్రాణాలను పోగోట్టుకుంటున్నారని చెప్పారు. సుమారు 18.35 శాతం మంది మహిళలు దీని బారిన పడగా, ఇప్పటి వరకు 35 వేల 700 మంది దీని బారిన పడి మరణించారని ఆయన వివరించారు. బీడీ కార్మికుల పోట్టగోడుతున్నామని మరో వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. బీడీ కార్మికులకు ఒనగూరే నష్టమేమి వుండదని, అయితే బీడీ కంపెనీల యాజమానులు అత్యధిక మంది రాజకీయ నేతలే వున్నారని రామదాస్ ఆరోపించారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anbumani ramadoss  pictorial warning  victim  tobacco lobbying  

Other Articles