Modi | Amithsha | Appriciation

Pm modi appriciate bjp president amith sha in national executive meeting

advani, amith sha, modi, bjp, bangalore, elections, karnataka, telangana, tamilnadu, kerala

The two-day Bharatiya Janata Party (BJP) National Executive meeting began here in Bengaluru on Friday. Prime Minister Narendra Modi, BJP president Amit Shah, External Affairs Minister Sushma Swaraj and senior leaders LK Advani and Murli Manohar Joshi are among those attending the meeting.

అమిత్ 'ష'భాష్.. ప్రధాని మోదీ అభినందనలు

Posted: 04/03/2015 05:25 PM IST
Pm modi appriciate bjp president amith sha in national executive meeting

ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలతో నెంబర్ వన్ గా నిలిచిన బిజెపి పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ సభ్యత్వాలతో రికార్డు సృష్టించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా పై ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీని ముందుండా నడిపించడంలో అమిత్ షా ఎంతో నేర్పుగా వ్యవహరిస్తున్నారని మోదీ అభినందించారు. ఎల్.కె అడ్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు పలువురు సీనియర్, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న ల్యాండ్ బిల్ గురించి పార్టీ నేషనల్ ఎక్సిక్యూటివ్ మీటింగ్ లో చర్చించారు. ఎలాగైనా బిల్ ను ఆమోదింపజేసేకకోవాలని పార్టీ అజెండాగా పెట్టుకుంది. బిజెపికి దక్షిణాదిలో కర్నాటక మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పెద్దగా పట్టులేదు. ఈ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించటంతోపాటు అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయాలనేది జాతీయ కార్యవర్గంలో చర్చించి ఒక విధాన నిర్ణయం తీసుకోనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ఒంటరి పోరాటం చేయాలని పలువురు సీనియర్, జూనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించినట్లు తెలిసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : advani  amith sha  modi  bjp  bangalore  elections  karnataka  telangana  tamilnadu  kerala  

Other Articles