samsung electronic goods container looted in noida

Robbers escape with goods worth rs 25 crore from kalindi kunj

Rs 25 crores electronic goods looted, samsung electronic goods container looted, cinema style robbery in delhi, cinema style robbery in Noida, cine style robbery in Uttar pradesh,

samsung electronic goods container which was enrouted to Uttar Pradesh Noida looted in national capital Delhi worth Rs 25 crores.

సినిమా ఫక్కీలో రూ.25 కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల చోరీ..!

Posted: 04/02/2015 09:54 PM IST
Robbers escape with goods worth rs 25 crore from kalindi kunj

సినిమా ఫక్కీలో ఏకంగా ఒక కంటైనర్ ఎటక్ట్రానిక్ వస్తువులను అపహరించుకుపోయారు దొంగలు. దొంగతనాలు చేయడం పెద్ద కష్టం కాదన్నట్లుగా సినిమాల్లో చూపించడం.. ఆ సినిమాలు సక్సెస్ సాధించడం మాత్రమే మనం  చూస్తుంటాం కాని.. సినిమాల్లో మాదిరిగా దొంగలు తెలివి మీరి దోంగతనాలకు తెగబడుతున్నారు. ఒక్కటి, అనేక చిత్రాలు దోంగతనం ఇతివృత్తంతోనే రావడం.. వాటి సక్సెస్ తో సీక్వెల్లు రావడం పరిపాటిగా మారింది. అచ్చం సినిమా పక్కీలో దేశ రాజధానిలో ఒక కంటైనర్ లారీ నిండుగా వున్న ఎలక్ట్రానిక్ వస్తువులను దోంగలు అపహరించుకుపోయారు. దాని విలువ సుమారుగా 25 కోట్ల రూపాయలు కావడంతో.. అధికారులు గోప్యంగా వుంచినా.. ఎట్టకేలకు బహిర్గతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ శివార్లలో ఉన్న కాళిందీకుంజ్ ప్రాంతం. తెల్లవారు జామున ఒంటిగంట సమయంలో శామ్సంగ్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కును దోపిడీ దొంగలు అటకాయించారు. ఆ కంటైనర్ తలుపులు పగలగొట్టి మరీ దాంతో పారిపోయారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడాకు ఆ కంటైనర్ వెళ్తోంది. ఆ వాహనం డ్రైవర్, క్లీనర్లు ఇద్దరినీ దొంగలు చితక్కొట్టారు. చివరకు ట్రక్కుతో సహా పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆగ్నేయ ఢిల్లీ ప్రాంతంలో పోలీసు బృందాలను మోహరించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samsung  Electronic goods  container  robbery  

Other Articles