brett lee Romances Tannishtha Chatterjee | Unindian Movie Updates

Australian former cricketer brett lee romances tannishtha chatterjee

Brett Lee news, Brett Lee latest news, Brett Lee affairs, Brett Lee scandals, Brett Lee romances tannishtha Chatterjee, tannishtha Chatterjee hot photos, tannishtha Chatterjee hot stills, tannishtha Chatterjee romance, unINDIAN movie teaser, unINDIAN movie news, unINDIAN movie trailer

australian former cricketer brett lee Romances Tannishtha Chatterjee : Brett Lee Romances Tannishtha Chatterjee in his first lead role in unINDIAN movie. The trailer is out now.

ITEMVIDEOS: ఇండియన్ అమ్మాయితో బ్రెట్ ‘లీ’లలు

Posted: 04/02/2015 09:47 PM IST
Australian former cricketer brett lee romances tannishtha chatterjee

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ గురించి తెలియని వారెవ్వరూ వుండరు. ప్రతిభతో క్రికెట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ పేసర్.. తన బౌలింగ్ తో ఎందరో బ్యాట్స్ మెన్లను ముచ్చెమటలు పట్టించాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి తప్పుకున్న బ్రెట్ లీ.. తన వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నాడు. తాజాగా ఓ ఇండియన్ అమ్మాయితోనూ ఇతగాడు లీలలు కొనసాగిస్తున్నాడు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

బాలీవుడ్ లో ‘అన్ ఇండియన్’ పేరిట ఓ సినిమా రూపొందుతోంది. అనుపమ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రెట్ లీ, తనిష్తా ఛటర్జీ జంటగా నటిస్తున్నారు. ఆస్ట్రేలియా, భారత్ సంస్కృతులు కలగలిసిన కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ సినిమాను ఆస్ట్రేలియా ఫిలిం ఫండ్ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో బ్రెట్ లీ ఓ పాటలో డ్యాన్స్ చేశాడు కూడా!

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు సలీం, సులేమాన్ ద్యయం సమకూర్చిన ఓ పాటలో బ్రెట్ లీ బాగానే డ్యాన్స్ చేసినట్లుగా దర్శకుడు తెలిపాడు. ఓ ఆస్ట్రేలియన్ ఇండియన్ అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు.. అతడు ఆమెను ఎలా దక్కించుకున్నాడు..? ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..? అనే అంశాలపై ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unINDIAN movie teaser  Brett Lee  Tannishtha Chatterjee  

Other Articles