pujitha suicide case mystery | The Hyderabad Police investigation

Hyderabad punjagutta police started investigation on pujitha suicide case

pujitha suicide case, pujitha suicide, krishna dist pujitha, pujitha death controversy, pujitha suicide punjagutta station, pujitha death mystery, hyderabad punjagutta police station

hyderabad punjagutta police started investigation on pujitha suicide case : The Hyderabad Police started their investigation on girl pujitha suicide case which gone viral. In this case several doubts are coming out.

పూజితది ఆత్మహత్యా..? లేక అత్యాచారం చేసి చంపేశారా..?

Posted: 04/02/2015 09:33 PM IST
Hyderabad punjagutta police started investigation on pujitha suicide case

ఇటీవలే కృష్ణాజిల్లా నందిగామకు చెందిన యువతి పూజిత హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈమె హైదరాబాద్ బయలుదేరడానికి ముందు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసింది కూడా! దాంతో ఈ యువతి ఆత్మహత్య చేసుకుని వుంటుందని అంతా భావించారు. అయితే.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే.. కృష్ణాజిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తొలుత పూజిత మృతి సమాచారం తెలియగానే కుటుంబసభ్యులు వ్యక్తం చేశారు కానీ.. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఆ తర్వాతి పరిణామాలను బట్టి ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి వుందని అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తంగా పూజిత మరణంపై అన్ని కోణాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కనుగొన్న పోలీసులు ఆ దిశగా తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దర్యాప్తులో భాగంగానే పూజిత ఫేస్బుక్ డీటైల్స్, మెసేజ్ చాటింగ్ విషయాలను తెలుసుకునేందుకు ‘ఫేస్ బుక్’ ప్రధాన కార్యాలయం నుంచి మొత్తం డేటాను తెప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక పూజిత స్నేహితుడుగా చెబుతున్న అక్షయ్, బీహార్ రాష్ట్రంలోని పోలీసు అధికారి కుమారుడు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశంలో పూజిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఎవరూ గమనించక పోవటమేంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న పూజిత శరీరం ఆ స్థాయిలో తగులబడుతుందా..? అనేది మరో అనుమానంగా ఉంది. మరి.. దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెల్లడవుతాయో వేచి చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pujitha suicide case  hyderabad punjagutta police station  

Other Articles