maa elections going on peacefully

Maa elections going on peacefully

maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema

movie artists association elections goes peacefully

ప్రశాంతంగా కోనసాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోనియేషన్ ఎన్నికలు

Posted: 03/29/2015 11:26 AM IST
Maa elections going on peacefully

టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా కోనసాగుతున్నాయి. గతానికి భిన్నంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ ఎన్నికలలో అధ్యక్ష పదవికి నటకీరిటి రాజేంద్ర ప్రసాద్, సహజ నటి జయసుధలు బరిలో నిలవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో కొనసాగుతున్నాయి. ఇరువురి ప్యానెల్ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఇందులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగునున్న పోలింగ్ లో సుమారు 750 మంది 'మా' సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే,  తెలుగు సినిమా పరిశ్రమ సభ్యులం అంతా ఒక్కటే అంటూ బీరాలు పోయిన అగ్రశేణి నటులు, నటీమణులు మధ్య భేదాభిప్రాయాలు వున్నాయని.. వారి మధ్య  నెలకొన్న లుకలుకలుతో ఎన్నికలకు సాధరణ ఎన్నికల వాతావరణం అలుముకుంది.

ఇప్పటివరకు 'మా'కు అధ్యక్షుడుగా వ్యవహరించిన నటుడు మురళీ మోహన్ పదవీకాలం ముగియడం, దీంతో పాటు ఎంపీగా ఎన్నికవ్వడంతో.. మా లో తన అదిపత్యానికి ఎదురులేకుండా బయట నుండి తన ప్రభావాన్ని చూపించాలని యోగించి.. జయసుధను బరిలో నిలపడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ పరిస్థితులకు దారి తీస్తాయోనని పేద కళాకారులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్రపరిశ్రమ నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad pannel  jayasudha pannel  maa president elections  

Other Articles