Australia sets 329 runs target to India

Australia sets 329 runs target to india

India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

Australia batting steadily against India in world cup second semi final

టీమిండియా విజయలక్ష్యం 329 పరుగులు

Posted: 03/26/2015 01:08 PM IST
Australia sets 329 runs target to india

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా సిడ్నీ వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో అతిధ్య జట్టు అస్ట్రేలియా ధోని సేన ముందు 329 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.  టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, ఫించ్ నిలబెట్టారు. రెండో వికెట్ కు 182 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 197 స్కోరు వద్ద వీరి భాగస్వామ్యాన్ని ఉమేష్ యాదవ్ విడదీశాడు. సెంచరీ వీరుడు స్మిత్(105) పరుగుల వద్ద అవుట్ చేశాడు.

స్మిత్ మొత్తం మ్యాచ్ ను తన వైపు తిప్పుకున్నాడు. పదకొండు ఫోర్లు రెండు సిక్స్ లతో రాణించాడు. అటు మరో ఓపెనర్ ఫించ్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఏడు ఫోర్లు, 1 సిక్స్ తో రాణించిన ఫించ్ నిలకడగా అడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. 232 పరుగుల వద్ద విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. 233 పరుగుల వద్ద ఫించ్ అవుటడవడంతో ఒక్క పరుగు తేడాతో ఆసీస్ 2 వికెట్లు చేజార్చకుంది. తర్వాత వరుసగా కెప్టెన్ క్లార్క్(10), ఫాల్కనర్(23), వాట్సన్(28) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

కాగా ఈ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను తలపిస్తోంది. అదే ఉత్కంఠ, గెలుపు ఎవరిదని యావత్ భారతవని ఎదురుచూపులు.. మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ఖురాన్ ఫఠనాలు కొనసాగుతున్నాయి. 2003లో ముందుగా బ్యాటింగ్ చేసిన అసీస్ ను కెప్టెన్ రికీ పాంటింగ్ దూకుడుగా ఆడి 359 పరుగులను సాధించారు. కేవలం రెండు వికెట్లను కోల్పియన అసీస్ ను రికీపాటింగ్ ఎనమిది సిక్స్ లు, నాలుగు ఫఓర్ల సాయంతో 140 పరుగులు సాధించడం, అతనికి మరో ఎండ్ లో వున్న మార్టిన్ కూడా ఒక సిక్స్,  ఏడు ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించింది.

అయితే ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ (82), రాహుల్ ద్రావీడ్(47) మినహా ఇతర బ్యట్స్ మెన్లు ఎవ్వరూ రాణించకపోవడంతో భారత్ ఆ మ్యాచ్ లో పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుపోందింది. మెక్ గ్రాత్ మూడు వికెట్లు తీసుకోగా, బ్రెట్ లీ రెండు, సైమండ్స్ రెండు విక్కెట్లను తీసి భారత్ ఆటగాళ్లను నియంత్రిచారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  

Other Articles