ramgopalvarma | section 66A | FIR

Under section 66a a case filed on ramgopal varma

ramgopalvarma, rgv, varma, twitter, tweet, dera baba, sachasouda, supreme court

The Ludhiana police landed in a tricky and awkward situation on Wednesday after two of its personnel were rushed to Mumbai to serve a notice to filmmaker Ram Gopal Varma under Section 66A of IT Act which was struck down by Supreme Court of India on Tuesday.

రామ్ గోపాల్ వర్మ పై కొట్టేసిన సెక్షన్ కింద కేసు, నోటీసులు..!

Posted: 03/26/2015 01:09 PM IST
Under section 66a a case filed on ramgopal varma

రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్. అయితే తాజాగా వర్మపై ఓ కేస్ నమోదైంది..అందులో భాగంగా నోటీసులు కూడా సిద్దమయ్యాయి. కానీ సుప్రీంకోర్ట్ తాజాగా కొట్టవేసిన సెక్షన్ కింద కేసు నమోదు కావడమే ఇప్పుడు తాజా వార్తల్లోకి ఎక్కింది. భావప్రకటన స్వేఛ్చకు భంగం కలిగిస్తున్న ఈ సెక్షన్ ను కొట్టవేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయాన్ని వెలువరించింది. వ్యక్తులకు ఉన్న బావప్రకటన స్వేఛ్చకు ఇది ఎంత మాత్రం అనువు కాదని సుప్రీం అభిప్రాయపడింది.

దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్లోని లుధియానాలో కేసు నమోదు అయ్యింది. ఫిబ్రవరి 13న  'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  వర్మ వివాదాస్పద ట్విట్లపై డేరా అనుచరుడు  లుధియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం వర్మపై సెక్షన్ 66A  కింద కేసు నమోదు చేశారు.ఇప్పటికే పోలీసులు వర్మకు నోటీసులు అందించేందుకు ముంబయి చేరుకున్నారు.

డేరా సచ్చా సౌద అధినేత గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాస్ డేరా బాబాను వర్మ గాడిద గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే క్రాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేశారు. మరోవైపు సెక్షన్ 66Aను  సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే సెక్షన్ ను కొట్టి వేసిన తరువాత వర్మ లాంటి వివాదాలకు కారణమైన వ్యక్తిపైనే ఈ సెక్షన్ పై కేసు వార్తల్లో నిలుస్తోంది. అయితే సుప్రీం కోర్ట్ తీర్పు వల్ల తాజా కేసు మాత్రం నిలిచే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తానికి వార్తల కోసం వివాదాలకెక్కే వర్మకు ఇప్పుడు సెక్షన్ 66A  కూడా ఫ్రీగా పబ్లిసిటిని తెచ్చిపెడుతోంది. మరి దీనిపై వర్మ ఏమని ట్వీట్ చేస్తాడో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopalvarma  rgv  varma  twitter  tweet  dera baba  sachasouda  supreme court  

Other Articles