telangana | job | notifications

Telanagana govt delay on job notifications on the state

telangana, govt, jobs, kamalanathan committee, notifications, vaccencies, state cader

telanagana govt delay on job notifications on the state. the telanagana govt not moving on the notification for the jobs. unemployees and students are waiting for the job notifications.

ఎప్పుడెప్పుడు.. ఉద్యోగ ప్రకటన ఎప్పుడు..?

Posted: 03/25/2015 10:21 AM IST
Telanagana govt delay on job notifications on the state

ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై తెలంగాణ శాసనసభలో వాడి,వేడి చర్చ జరిగింది.ఈ చర్చ సందరబ్భంగా అధికార,విపక్షాల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, లక్ష్మణ్‌తో పాటుతో ఇతర పక్షాల నాయకులు ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ప్రభుత్వం తరపున మంత్రులు ఈటల రాజేందర్‌,హరీష్‌రావు,నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుని సమాధానాలు చెప్పారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం ప్రకటించగా, ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ,సీపీఎం పార్టీలు సభలో వాగ్వాదానికి దిగాయి.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు, హోంగార్డులు, అంగన్‌వాడి వర్కర్లు ఇతర పోస్టులన్నీ కలిపి 1,07,744 పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. డైరెక్ట్ రిక్రూర్ మెంట్ ద్వారా 55,878, ప్రమోషన్ల ద్వారా 23,830, క్లాస్‌ 4 ఉద్యోగాలు 12,617, హోంగార్డులతో పాటు ఇతర పోస్టులు 4,986, మిగతా ఖాళీ పోస్టులు 10,533 పోస్టులు ఉన్నాయని ఈటెల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్ర కేడర్‌ ఉద్యోగాల విభజనకై ఏర్పాటు చేసిన కమలనాథన్‌ కమిటీ నివేదిక రాకపోవడంతోనే నియామకాల ప్రక్రియ ఆలస్యమవుతోందని, నివేదిక వచ్చిన తర్వాత నియామకాలు ప్రారంభిస్తామన్నారు. కమలనాథన్‌ కమిటీ నివేదిక వచ్చాక 15వేల రాష్ట్ర కేడర్‌ పోస్టులను భర్తీ చేయాల్సిఉంటుందని చెప్పారు.మిగతా 85 వేల పోస్టులు జోనల్‌,జిల్లా,మల్టి జోనల్‌ పోస్టులు ఉన్నాయని, తాత్కాలిక పోస్టులు 7,747 పోస్టులు ఉన్నాయని తెలిపారు. అయితే ఉద్యోగ ప్రకటనకు కమలనాథన్ కమిటికి పేచి పెట్టడాన్ని నిరుద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు వల్ల నీరు, ఉద్యోగాలు వస్తాయని అనుకున్నా, ఉద్యోగాలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే రాష్ట్ర కేడర్ కాకుండా, మిగిలిన ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క వయోపరిమితి మించి పోతోందని నిరుద్యోగులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి మన నీళ్లు, మన ఉద్యోగాలు అనే నినాదం. అయితే తెలంగాణ రాష్ర్టం కొత్తగా ఏర్పడ్డాక ఉద్యోగాలు వస్తాయని అనుకున్న తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రకటన ఎంతకీ రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. అయితే తెలంగాణ లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ కూడా ఉద్యోగ ఖాళీలను భారీ గా భర్తీ చేస్తామని ముందు నుండి ఊరిస్తూవచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ ప్రకటనను విడుదల చెయ్యడానికి తీవ్ర జాప్యం చేస్తోంది. అందుకు గాను నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా పది సంవత్సరాలు వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే వయోపరిమితి పెంపు కొంత లాభం కలిగించే అంశమే అయినా ఉద్యోగ ప్రకటనలో జాప్యం నిరుద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. కనీసం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ప్రకటన చెయ్యాలని అందరూ కోరుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  govt  jobs  kamalanathan committee  notifications  vaccencies  state cader  

Other Articles