sonia gandhi | pcc | letters

Sonia gandhi wrote letters to pcc on congress party

sonia gandhi, pcc, letters, rahul gandhi, congress, kerala, telanagana, jharkhand

sonia gandhi wrote letters to all pccs for the reconstuction of congress party. the some pcc are reply to the letters of sonia gandhi, but some didnt reply.

'ఆ రోజులు పోయాయ్' అన్నట్లు సోనియా గాంధీ వ్యవహారం

Posted: 03/25/2015 09:05 AM IST
Sonia gandhi wrote letters to pcc on congress party

అనుకున్న దొకటి.. అయిందొకటి.. బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. అని ఓ పాత సినిమా పాట అందరూ వినే ఉంటారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇప్పుడు ఈ పాట బాగా సూట్ అవుతుంది. ఇంతకీ ఎందుకు అలా అంటున్నారా అని అనుకుంటున్నారా.... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పీసీసీ చీఫ్‌లకు ఆమె రాసిన లేఖలకు స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా, ఎన్నికలపరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీకి జవసత్వాలు పెంచాలంటే ఏం చేయాలో అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ పీసీసీ చీఫ్‌లకు సోనియా గాంధీ లేఖలు రాశారు. అన్ని స్థాయిల నేతల్లో నూ జవాబుదారీతనాన్ని పెంచడం, సంస్థాగత సంస్క రణలు, కేడర్‌ బిల్డింగ్‌ తదితర లక్ష్యాలను వివరించారు. పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు సలహాలు, ప్రశ్నలతో కూడిన ఏఐసీసీ సర్క్యులర్‌పై ఫిబ్రవరి 28లోగా అభిప్రాయాలు తెలియజేయాలని సోనియా కోరారు.

రాహుల్‌ గాంధీ స్వయంగా పార్టీ నేతలతో చర్చలు జరిపి, పార్టీ పునరుజ్జీవానికి రూపొందించిన సలహాలను కూడా సోనియా ఈ లేఖల్లో వివరించారు. పీసీసీలు ఏఐసీసీకి తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ముందు జిల్లా, బ్లాకు స్థాయిల్లో పార్టీ కేడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించి, నివేదికలు రూపొందించాలని సోనియా ఆదేశించారు. పీసీసీల నుంచి వచ్చే స్పందనలను ఏఐసీసీ సమావేశాలకు ముందు పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ విశ్లేషించ వలసి ఉంది. తద్వారా ఏఐసీసీ సమావేశాల్లో కొత్త ఎజెండా రూపొందించాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది.  ఇన్ని లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ సోనియా లేఖలపై స్పం దించిన పీసీసీలను వేళ్లపై లెక్కించవచ్చు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీలు మాత్రమే ఫిబ్రవరి 28 గడువు లోగా తమ అభిప్రా యాలతో కూడిన నివేదికలను సమర్పించాయి. కాగా మిలిగిన పిసిసిలు మాత్రం ఇంకా మీనవేషాలు లెక్కిస్తున్నాయి. అయితే నిన్నటి దాకా అమ్మ అనుగ్రహం కోసం ఎదురు చూసిన వాళ్లు అమ్మే స్వయంగా లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. బలం లేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లు ఊడుతుందని తెలుగులో సామెత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితి ఇలానే ఉంది. అధికారం చేతిలో చేదు కాబట్టి ఎవరూ పాపం అమ్మగారిని చూసి భయపడటం లేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  pcc  letters  rahul gandhi  congress  kerala  telanagana  jharkhand  

Other Articles