ysrcongress | ap | assembly

Ysr congress leaders jagan rised questions in ap assembly

ys jagan, ap, assembly, land pooling, capital city, chandrababu, uma,

ysr congress leaders, jagan rised questions in ap assembly. ys jaganmohan reddy questions on land pooling, capital city in ap. the speaker reject the oppositions request.

మారని వైసీపీ.. పలు అంశాలపై వాయిదా తీర్మానాలకు పట్టు

Posted: 03/25/2015 10:43 AM IST
Ysr congress leaders jagan rised questions in ap assembly

ఏపీ శాసనసభలో వాయిదా పర్వం కొనసాగుతోంది.  భూసమీకరణ, రాజధాని నిర్మాణంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దాంతో  సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యుల ఆందోళనలతో వెంటనే వాయిదా పడింది. సభలోవైయస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేల వైఖరిపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఇంకా మూడు రోజులే ఉందని, ఇంకా చాలా అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. అందుకు విపక్ష సభ్యులు సహకరించాలని అచ్చెన్నాయుడు కోరారు. విపక్షం సభకు అడ్డుకుంటోందని, సభా సమయాన్ని వైసీపీ వృథా చేస్తోందని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. సభ నియమ నిబంధనలపై వైసీపీ సభ్యులకు మరోసారి క్లాసులు నిర్వహించాలని మంత్రి సూచించారు. సభా సమయాన్ని వృథా చేయడం మంచిది కాదని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. సభను జరగనివ్వండి..అన్ని విషయాలు చర్చిద్దామని, తాము అనుకున్నదే జరగాలని వైసీపీ సభ్యులు భావిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే వైసీపీ సభ్యులు రచ్చ చేస్తున్నారని కాల్వ ధ్వజమెత్తారు. సభ్యుల ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాజధాని ప్రాంతంలో బాధలపై శాసనసభలో చర్చ జరగకపోతే ఎలా అని ప్రతిపక్ష నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రశ్నించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ బిల్లుపై మాత్రమే గత అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. రైతులు, కూలీ రైతులు,  కౌలు రైతుల గురించి చర్చించకుంటే ఎలా అని అన్నారు. గత సమావేశాల్లో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల గురించి చర్చ జరగలేదన్నారు. ఈ అంశంపై చర్చకు  ఎప్పుడు సమయం ఇస్తారో దయ ఉంచి చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు. రాజధాని అంశంపై మార్చి 16, 2015న 344 కింద చర్చకు అడిగామని ఆయన తెలిపారు. అందుకు సంబంధించి జిరాక్స్ కాపీలను సభకు చూపించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  ap  assembly  land pooling  capital city  chandrababu  uma  

Other Articles