newzelanad preforming in semi finals | southafrica

Newzelanad batsmen well prefoming in world cup semi finals with southafrica

guptill, maccullum. southafrica, newzeland, worldcup, semis

newzelanad batsmen well prefoming in world cup semi finals with southafrica. in the semi final match of world cup 2015, newzeland preforming best in this match. maccullam out when he was at 59. after that guptill also out.

దంచి కొడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు

Posted: 03/24/2015 01:37 PM IST
Newzelanad batsmen well prefoming in world cup semi finals with southafrica

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ విజృంభించాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ బాదాడు. అయితే మెక్ కల్లం 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తరువాత బ్యాటింగ్ కు దిగిన విలియమ్ సన్ 6 పరుగులకే వెనుదిరిగారు. అయితే చివరి మ్యాచ్ లో రెచ్చిపోయి ప్రత్యర్థి జట్టుకు చెయటలు పట్టించిన గుప్టిల్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ 38 బంతుల్లోమూడు ఫోర్లు, ఓ సిక్స్ తో 34 పరుగుల వద్దే ఔటయ్యాడు. ప్రస్తుతం రాస్ టేలర్ క్రీజ్ లో ఉన్నాడు. తమ జట్టు భారాన్ని భుజస్కందాలపై మోస్తు న్యూజిలాండ్ ను విజయతీరాలు చేరవేస్తాడో లేదో చూడాలి.

అయితే సౌతాఫ్రికా జట్టు కు ధీటుగా సమాదానమివ్వడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టింది. ఎవరూ ఊహించని విధంగా బాల్ ను బౌండరీలకు పరుగులు పెట్టించడంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ లు విజయం సాధించారు. మొదటి ఐదు ఓవర్లలో న్యుజిలాండ్ రన్ రేట్ చూసిన వారెవరైనా బ్యాటింగ్ అంటే ఇదీ అనే తీరిటో ఆడారు. మొదటి ఓవర్ లోనే 8, రెండో ఓవర్ లో 18, మూడవ ఓవర్ లో 6, నాల్గవ ఓవర్ లో 14, ఇక ఐదవ ఓవర్ లో అత్యధికంగా 25 పరుగులు తీసి న్యూజిలాండ్ హాట్ ఫేవరెట్ గా ముందు నిల్చింది. సౌతాఫ్రికా నిర్దేశించిన స్కోర్ ను సాధించాలంటే న్యూజిలాండ్ 6.7 రన్ రేట్ ను కలిగి ఉండాలి, కానీ న్యుజిలాండ్ ప్రస్తుతానికి 7.22 రన్ రేట్ తో దూసుకుపోతోంది. రాస్ టేలర్ 25 పరుగులతో, ఇలియోట్ 6 పరుగులతో క్రీజ్ లో నిలిచారు. 19 ఓవర్లలో న్యుజిలాండ్ 140 పరుగులకు 3 వికెట్లను కోల్పోయింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guptill  maccullum. southafrica  newzeland  worldcup  semis  

Other Articles