The Supreme Court | section 66A

Sc clear that section 66a is unconstitutional

supreme court, section 66A, constitution, govt, balthakrey, mumbai

The Supreme Court on Tuesday declared Section 66A of Information Technology Act as unconstitutional and struck it down.

సెక్షన్‌ 66Aను కొట్టివేసిన సుప్రీంకోర్ట్

Posted: 03/24/2015 03:12 PM IST
Sc clear that section 66a is unconstitutional

భారత్ లాంటి దేశాల్లో భావప్రకటన స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు స్వేచ్చనిచ్చింది బారత రాజ్యాంగం. అయితే నెట్ లో ఏ మాత్రం తమకు ప్రతికూలంగా రాసిన పోస్ట్ గురించి చట్టపరంగా చర్యలు తీసుకునేలా సెక్షన్‌ 66A వీలుకల్పిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఈ చట్టాన్ని రద్దు చేస్తు తీర్పునిచ్చింది.  ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేయబోమని ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. కంప్యూటర్‌, మొబైల్‌ లేదా ఇతర సమాచార సాధనాల ద్వారా ఎవరైనా ఇబ్బంది కరంగా మెసేజ్‌ చేస్తే వారికి  మూడేళ్ల  జైలు శిక్ష విధించేలా  సెక్షన్‌ 66A  కల్పిస్తోంది. అయితే చట్టంలో అవమానకరైన సమాచారం అనే పదం అస్పష్టంగా ఉందని,  దీన్ని ఎలా అంటే అలా నిర్వచించుకునే వీలుందని అనేక మంది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు

శివసేన అధినేత బాల్‌ఠాక్రే చనిపోయినప్పుడు ముంబయ్ లో బంద్ నిర్వహించడంపై  షహీన్ ధద అనే యువతి ఫేస్‌బుక్‌లో ప్రశ్నించింది. రేణు శ్రీనివాసన్ అనే మరో యువతి ఆ కామెంట్‌కు లైక్ కొట్టింది. దాన్ని నేరంగా పరిగణించి ఆ ఇద్దరు యువతులను పోలీసులు 2012లో అరెస్టు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి గారి గురించి సోషల్ మీడియాలో అవమానకరంగా కామెంట్ చేశారని, ఓ కాలేజ్ విద్యార్థిని ఏకంగా జైలు పాలుచేశారు. అలా సోషల్ మీడియాలో కూడా కనీసం తమ గొంతుకు రూపం ఇవ్వకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది.

అయితే ఐటీ చట్టం సెక్షన్‌ 66A ఆధారంగా అరెస్టు చేస్తే, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేననీ సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. మొత్తానికి ఇక మీదట సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో అనే అనుమానం అవసరం లేదు. స్వేఛ్చగా అనుకున్న ఆలోచనలను ఎక్స్ ప్రెస్ చేసేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్వచ్ఛంద సంస్థలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  section 66A  constitution  govt  balthakrey  mumbai  

Other Articles