President expresses concern over parliament complex fire

president expresses concern over parliament complex fire, President Pranab Mukherjee expressed serious concern, President calls for urgent probe, President orders authorities concerned to conduct an urgent inquiry, president initiates prevent such incidents in the future,

President Pranab Mukherjee today expressed serious concern over the massive fire which broke out inside the Parliament complex here this afternoon.

ఫార్లమెంటు భద్రతపై రాష్ట్రపతి ప్రణబ్ తీవ్ర అందోళన

Posted: 03/22/2015 08:03 PM IST
President expresses concern over parliament complex fire

భారత పార్లమెంటు భద్రత విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటుకేది భద్రత.. తనిఖీల సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  పార్లమెంటు ఆవరణలో అంత పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడం తనకు తీవ్ర ఆందోళన కలిగించిందని, ఇలాంటి ఘటన జరగడం పార్లమెంటు ఆవరణలో ఉన్న భద్రతను ప్రశ్నించేలా చేస్తుందని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత పార్లమెంటు ఆవరణలోని రిసెప్షన్కు సమీపంలోగల పవర్ స్టేషన్కు చెందిన ఏసీ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

 ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. కానీ భారీ స్థాయిలో అరగంటపాటు మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. చివరికి పన్నెండు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. దీనిపైనే రాష్ట్రపతి స్పందిస్తూ ఇక నుంచి ప్రతి క్షణం పార్లమెంటు ఆవరణం పకడ్బందీ రక్షణతో ఉండాలని, అణువణువు ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తుండాలని ఆదేశించారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలను శోధించి మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని పార్లమెంటు సిబ్బందికి చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President Pranab Mukherjee  Parliament  fire accident  

Other Articles