Westindies at the edge of loosing with the nuzeland match at vallington

westindies, newzeland, world cup, gale,

westindies at the edge of loosing with the nuzeland match at vallington. in vellington west indies star bats man dispointesd westindies fans.krisgale at 61 he loose his wicket.

ఓటమి అంచున వెస్టిండీస్.. నిరాశపరిచిన గేల్

Posted: 03/21/2015 12:55 PM IST
Westindies at the edge of loosing with the nuzeland match at vallington

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడేతోంది.  మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 393 పరుగులు చేసింది. విండీస్ కు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లు ముగిసే సరికి విండీస్ ఐదు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆదిలోనే 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన  వెస్టిండీస్ కష్టాలను కొనితెచ్చుకుంది. క్రిస్ గేల్  ప్రారంభంలో దూకుడుగా ఆఢినా, తర్వాత చేతులెత్తడం వెస్టిండీస్ ఆశలు ఆవిరయ్యాయి. క్రిస్ గేల్ 33 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశారు.

క్రిస్ గేల్ 61, జాన్సన్ 3, సిమన్స్ 12, సామ్యుల్స్ 27, కార్టర్ 32, సమ్మి 27, యాండ్రి రసిల్స్ 20 పరుగులతొ వెస్టిండీస్ కు తోడుగా నిలిచారు. హోల్డర్ 22 పరుగులతో, జెర్మి టేలర్ 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 26.3 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 219 పరుగులు చేసింది. వెస్టిండీస్. దాదాపు ఓటమికి అంచులో ఉన్న వెస్టిండీస్, ఆ పరిస్థితుల నుండి బయట పడే అవకాశాలు కనిపించడం లేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : westindies  newzeland  world cup  gale  

Other Articles