Narendra modi leaves xi jinping behind survey reveals pm better

prime minister narendra modi, Modi has pipped Chinese President Xi Jinping, Chinese President Xi Jinping, modi secured top rank in handling domestic and international affairs, global survey conducted by a Chinese firm, global leader, first place, xi jinping, survey, china, international, affair

Prime Minister Narendra Modi has pipped Chinese President Xi Jinping to secure the top rank in handling domestic and international affairs in a global survey conducted by a Chinese firm.

గ్లోబల్ లీడర్స్ లో జింపింగ్ వెనక్కి.. మోడీ ముందుకు

Posted: 03/19/2015 10:10 PM IST
Narendra modi leaves xi jinping behind survey reveals pm better

ఉత్తమ గ్లోబల్‌ లీడర్ల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి స్థానం దక్కించుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు. చైనా ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ గ్రూప్‌ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. దేశీయ, విదేశీ వ్యవహారాలను చక్కబెట్టడంలో మోదీకి తిరుగులేదని ఈ సర్వేలో తేలింది. ఎక్కువ మందికి తెలిసిన దేశాధినేతల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తొలి స్థానం దక్కించుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కేమరాన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

చైనా ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ గ్రూప్ ఈ సర్వేను బీజింగ్‌లో విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కేమెరూన్, నాలుగో స్థానంలో సింగ్ ఉన్నారు. భారత్, చైనా, యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యాలోని 4,500మందికి ఈ సర్వే చేరుకుందని చైనా అధికారిక డెయిలీ పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ సంబంధాలను మెరుగ్గా కొనసాగిస్తున్న జింపింగ్ రెండో స్థానం దక్కించుకున్నారని తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపర్చడంలో సమర్థవంతంగా ముందుకెళుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సర్వేలో అగ్రస్థానం సంపాదించారని పేర్కొంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  global leader  first place  xi jinping  

Other Articles