In ap assembly roja fire on speaker and cm chandrababu

ysrcp, roja, ap, assembly, media, chandrababu, speaker, kodela

in ap assembly roja fire on speaker and cm chandrababu. ysrcp mla roja rash words in ap assembly. ap cm chandrababu is a patient and speaker is a factionist roja sentenced.

స్పీకర్ ఫ్యాక్ష్యనిస్టు.. సిఎం రోగిస్టు: రోజా

Posted: 03/20/2015 08:39 AM IST
In ap assembly roja fire on speaker and cm chandrababu

ఏపి అసెంబ్లీలో రెచ్చిపోయి, బూతులు మాట్లాడిన రోజా ఇంకా కోపం చల్లారినట్లు లేదు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో మరో సారి ఫైరైంది. సభలో గతంలో ఎన్నడూ జరగనంత గందరగోళం జరిగడంపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. కనీసం వాటిని చూసిన తర్వాతైనా కొంత మార్పు వస్తుందని అనుకుంటే అది ఏ మాత్రం జరగలేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతా ఓ దిక్కు రోజా  ఓ దిక్కు అన్నంతగా రెచ్చిపోయి మాట్లాడారు. సాటి మహిళా ఎమ్మెల్యేలు కూడా రోజా వైఖరిపై విమర్శలు గుప్పించే స్థాయిలో రోజా మాటలు ఉన్నా, రోజా తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు.  

ఒక ఫ్యాక్షనిస్టు సభాధ్యక్షుడి స్థానంలో ఉంటే ఏమి జరుగుతుందో అదే జరిగింది అని రోజా మండిపడింది.ఎమ్మెల్యేలను బయటకు తోయించారు, మీడియా పాయింట్‌కు వస్తే ఎమ్మెల్యేలను పోలీసులతో కొట్టించారు, ఇంతకన్నా రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఉంటుందా అని రోజా ప్రశ్నించారు. కుంటోళ్లు, గుడ్డోళ్లకు రాజ్యం అప్పగించొచ్చుగానీ... బొల్లి వ్యాధి ఉన్నోళ్లకు అప్పగించకూడదు అని అన్నారు. ఓ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఇలాంటి వ్యాఖ్యలు తప్పు కదా అని చెప్పిన మీడియా వారిపైనే మండిపడింది రోజా. ఎల్లో జర్నలిజం చెయ్యద్దు... నా మేకప్‌ గురించి టీడీపీ వాళ్లు వ్యాఖ్యానించడంలేదా అని మీడియాకే రోజా ఎదురు ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుండి తొలగించినప్పుడు చంద్రబాబును దొంగ అన్న బుచ్చయ్య చౌదరి మాకు నీతులు చెబుతాడా అని రోజా మండిపడ్డారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  roja  ap  assembly  media  chandrababu  speaker  kodela  

Other Articles