Tdp leaders attacked on ysrcp leader ys jagan in assembly

jagan, ys rajashekarreddy, assembly, kalva srinivas, roshaiah, tdp

tdp leaders attacked on ysrcp leader ys jagan in assembly. in ap assembly sessions tdp leaders attacked on ys jagan. chief vep kalva srinivas said that ys rajashekarreddy cant accept jagan roshaiah sebtenced. in assembly they remember that old words.

వైయస్ రాజశేఖర్ రెడ్డి జగన్ గురించి ఏమన్నాడో తెలుసా...

Posted: 03/18/2015 03:32 PM IST
Tdp leaders attacked on ysrcp leader ys jagan in assembly

వైయస్ జగన ఏపి అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేస్తు జగన్ చేసిన విమర్శలను టిడిపిపక్షం సభ్యులు తిప్పికొట్టారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలో తలెత్తిన వివాదంపై జగన్ సుప్రీంకోర్టు ప్రతిని చదివి వినిపించారు. దేవినేని ఉమ తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అలసత్వమే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటకకు అవకాశం ఇచ్చిందని చేసిన విమర్శలపై స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని చదివిన జగన్, అర్థం కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటూ దేవినేని ఉమకు సలహా ఇచ్చారు. అయితే జగన్ సలహాపై చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు కౌంటర్ వేశారు.

వైయస్ జగన్ గురించి అతని తల్లిదండ్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ ఎన్నో సార్లు భరించలేమని, అందుకే బెంగళూరులో ఉంచినట్లు వైయస్ రోశయ్యతో చెప్పిన మాటలను ప్రస్తావించారు టిడిపి నేతలు. ముఖ్యమంత్రిగా పని చేసినపుడు రోశయ్య వైయస్ జగన్ గురించి చేసిన  ఈ కామెంట్లనే టిడిపి వారు అస్త్రాలుగా వాడుతున్నారు. పాత పేపర్ కటింగ్స్ తో సహా సభలో కాల్వ శ్రీనివాసులు జగన్ కు బదులిచ్చారు. ఇలాంటి వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకొమ్మని సమాధానం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మొత్తానికి గతంలో ఎప్పుడో రోశయ్య అన్న మాటలు ఇప్పుడు టిడిపి నేతలకు  ఉపయోగపడ్డాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  ys rajashekarreddy  assembly  kalva srinivas  roshaiah  tdp  

Other Articles