Woman raped murdered left naked in old gandhi hospital compound

Woman raped and murdered in hyderabad, women eft naked in Old Gandhi Hospital compound, 30 years old woman raped and murdered, victim’s body found naked, Old Gandhi Hospital building, victim body with injuries on her neck and other body parts, Violence against women in india, rape on women, sexual assault on woman, insult to modesty on woman, kidnapping woman, abduction of woman, cruelty by intimate partner or relatives on woman, trafficking of woman, persecution for dowry, woman dowry deaths, indecency towards woman, Rape most common crimes against women, crime on woman,

An unidentified woman in her late 30s was found dead early on Tuesday morning in Secunderabad. The victim’s body was found naked at a deserted spot behind the Old Gandhi Hospital building with injuries on her neck and other body parts.

30 ఏళ్ల మహిళలపై అత్యాచారం, హత్య, నగ్నంగా...

Posted: 03/18/2015 01:08 PM IST
Woman raped murdered left naked in old gandhi hospital compound

కామాంధులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరించినా.. ఇంకా ఆడపడుచుల ఆర్తనాథాలు వినబడుతూనే వున్నాయి. ఆడపడచులపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు, ఇతర వేదింపులతో దేశవ్యాప్తంగా సమైక్య తెలుగు రాష్ట్రం మూడవ స్థానంలో నిలచి అప్రతిష్ట పాలైనా.. మాకెంటి నష్టం అంటూ రెచ్చిపోతున్న కామాంధుల కామాగ్నికి మరో అడపడచు బలైంది. తెలంగాణలో షీ టీమ్ లను ఏర్పాటు చేసి అడపడుచులకు భద్రత కల్పస్తున్నా.. వారి కళ్లను కూడా కప్పి మగమృగాళ్లు అడపడచులపై అత్యాచారాలకు తెగబడుతూనే వున్నారు.

తాజాగా సికింద్రాబాద్ నగరంలోని పాత గాంధీ అస్పత్రి ఆవరణలో మరో మహిళపై అత్యాచారం చేసిన దుండగులు అమెను హత్య చేశారు. సుమారు ముఫై ఐదేళ్ల పైడిన ఓ గుర్తు తెలియని మహిళ శవం నగ్నంగా పడివుండటం.. గమనించిన మైట్రో రైలు కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. నిర్మానుష్య ప్రదేశంలో అమెను తీసుకువెళ్లిన మగమృగాళ్లు అమెపై అత్యాచారం చేసి.. మద్యం బాటిల్ తో పోడిచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతురాలు ఎవరనేది తెలియనప్పటికీ, అమెను ఎక్కడి నుంచైనా కిడ్నాప్ చేసి తీసుకువచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన జాగిలాలు మాత్రం రైతిఫైల్ బస్టాప్ వరకు వెళ్లి నిలిచిపోయాయి.

మృతురాలి వస్త్రాలను చించి వేసి ఘటనాస్థలంలో పడేసి వున్నాయి. అయితే తనపై అత్యాచారాన్ని అడ్డుకునేందుకు మహిళ కూడా తీవ్రంగానే ప్రయత్నించిందని ఈ పెనుగులాటలోనే అమె ఒంటిపై గాయాలు కూడా అయినట్లు స్థానిక పోలీస్ ఇన్స్ పెక్టర్ శివమారుతి తెలిపారు. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో వున్న ప్రైవేటు సిసిటీవీ ఫూటేజిని పరిశీలిస్తున్నామని, వాటి ఆధారంగా నిందుతులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం తరలిస్తున్నామని, నివేదిక అందిన తరువాత అమెపై అత్యాచారం జరిగిందా లేదా..? అన్నది తేలుతుందన్నారు. మృతురాలి మెడతో పాటు పోట్టలో మూడు బలమైన గాయలు అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర ధర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crime against women  Rape  Hyderabad  

Other Articles