Thahir boling and duminy hat trick leaves sl in tatters

Srilanka versus South africa, Srilanka vs South africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, South africa, South africa CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

Thahir boling and Duminy hat-trick leaves SL in tatters

శ్రీలంకను 133 పరుగలకు కట్టడి చేసిన సఫారీలు, డుమినీ హ్యాట్రిక్..

Posted: 03/18/2015 11:52 AM IST
Thahir boling and duminy hat trick leaves sl in tatters

ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా లీగ్ దశ దాటి నాకౌట్ ధశలోకి అడుగుపెట్టి జట్ల మధ్య జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్స్ సిడ్నీ వేదికగా దక్షిణాప్రికాతో జరిగుతున్న మ్యాచ్ లో శ్రీలంకను 133 పరుగులకు కట్టడి చేసింది. మ్యాచ్ మధ్యలో వరుణుడు అడ్డంకిగా నిలిచినా లంకేయులకు మాత్రం ఎలాంటి లాభం చేకూర్చలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 36.2 ఓవర్ వద్ద సిడ్నీ మైదానంలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగా, ఆ తరువాత ఆటను కొనసాగించగా కేవలంలో ఒక్క ఓవర్ లోనే శ్రీలంక అలౌట్ అయ్యి సఫారీల ముందు 134 పరుగులు లక్ష్యాన్ని పెట్టింది.

సఫారీల బాలింగ్ ధాటికి శ్రీలంక టాప్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆది నుంచి క్రమంగా వికెట్లను తీయడంతో లంకేయులు అది నుంచి కష్టాలను ఎదుర్కోంటున్నారు.4 పరుగులకే ఓపెనర్లు పెరీరా(3), దిల్షాన్(0) వికెట్లను లంక సమర్పించుకుంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగక్కర, తిరిమానెలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. సంగక్కర నెమ్మది ఆడుతుంటే, తిరిమానె దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ జట్టు స్కోరు 50 పరుగులు దాటించడమే కాకుండా మూడో వికెట్‌కు 50 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు. అ తరువాత 41 వ్యక్తిగత పరుగలు స్కోరు వద్ద తిరిమానె తాహిర్ బౌలింగ్‌లో ఔటుకాగా,. ఆ తర్వాత వచ్చిన జయవర్దనె(4) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో మ్యాచ్ భారం సంగక్కర, కెప్టెన్ మాథ్యూస్‌లపై పడింది. వీరిద్దరూ కొద్దిసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అంతేకాకుండా జట్టు స్కోరు 100 పరుగులు దాటించడంతో కీలక పాత్ర పోషించారు. 32 బంతుల్లో 19 పరుగులు చేసిన కెప్టెన్ మాథ్యూస్... డుమిని బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అ తరువాత వచ్చిన టెయిల్ ఎండర్లు సఫారీల బంతులకు మోకరిల్లారు.

వరుస సెంచరీలతో రాణించిన సంగక్కర కూడా అర్థ శతకానికి చేరువలో బోల్లాపడ్డాడు. దీంతో శ్రీలంక కేవలం 133 పరుగులను మాత్రమే సాధించింది. కాగా సౌత్ ఆఫ్రికా బౌలర్ డుమిని హ్యాట్రిక్ తో మెరిశాడు. సఫారీ బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 4 వికెట్లు, డుమిని ముడు వికెట్లు తీయగా, డెయిల్ స్టీయిన్, కెల్ అబాట్, మార్కెల్ చోరో విక్కెట్ సాధించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Srilanka  Scotland  srilanka  

Other Articles