Osmania university turns into balltle field

Osmania University turns into balltle field, unemployed students protesters agitation, students and police clash at ou, assembly, police, ou, mrps, ncc gate, osmania university, Police handover assembly on chalo assembly, unemployed students protesters agitation, osmania university latest news, osmania university

Osmania University turns into balltle field as students protesters agitation stoped by police

ఉద్యమాల పురటిగడ్డలో మళ్లి లేచిన నిరసన సెగ

Posted: 03/18/2015 12:43 PM IST
Osmania university turns into balltle field

ఉద్యమాల పురటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో సారి నిరసన సెగ లేచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు చెప్పగానే ఆరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమం టక్కున గుర్తుకు వస్తుంది. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాటి నుంచి నేటి విద్యార్థుల వరకు అందరికీ విద్యాబోదనతో పాటు ఉద్యమాల పాలు కలిపి చదివించింది ఉస్మానియా విశ్వవిద్యాలయమే. తొలి తరం నుంచి మలి తరం వరకు అందరినీ ఒకే బాటన నడిపించింది ఉస్మానియా యూనివర్శిటి. ఇప్పుడే అదే విశ్వవిద్యాలయంలో మరో ఉద్యమానికి తెర లేచింది. నాటి పరిస్థితులు మళ్ళీ పునారావృతం అయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకరమైన తరువాత మళ్లీ ఎందుకు ఉద్యమం లేచిందనేగా మీ ప్రశ్న..?

దేశంలోనే 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో తొలి సారిగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత కన్నెర్ర చేసింది. అధికారంలోకి వచ్చి రమారమి తొమ్మిదేళ్లు కావస్తున్నా.. ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వంపై వారు కన్నెర చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాల ప్రకటనలు వెలువరించకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ నుంచి ర్యాలీగా వస్తున్న నిరసనకారులు ఎన్ సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకోంది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకోంది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Osmania University  unemployed students protest  police students clash  

Other Articles