Telanagana assemly sessions got heat on seven mandals of bhadrachalam

telanagana, assembly, bjp, congress, trs

telanagana assemly sessions got heat on seven mandals of bhadrachalam. khamma dist. seven mandals added to andhrapradesh from telanagana. bjp, congress and trs discuss this issue in assembly at high tention.

టి. అసెంబ్లీలో ఏడు మండలాలపై వాడీవేడీ చర్చ

Posted: 03/16/2015 03:22 PM IST
Telanagana assemly sessions got heat on seven mandals of bhadrachalam

ముంపు మండలాల విలీనంపై తెలంగాణ అసెంబ్లీ వేడెక్కింది. దానికి కారణం మీరంటే మీరు అంటూ కాంగ్రెస్, తెరాస నేతలు పరస్పర విమర్శలకు దిగారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్రం భద్రాచలానికి చెందిన ఏడు మండలాలను కలుపితే ఎవ్వరూ నోరు మెదపలేదని , ఆంధ్రాలో కలిపి ఆ ఏడు మండలాలకు తీరని అన్యాయం చేశారంటూ పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర కలకలాన్ని రేపింది. దీనిపై స్పందించిన తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉండగా దాన్ని అడ్డుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ వల్లే ఆ ఏడు మండలాలు ఆంధ్రాప్రాంతంతో కలిశాయని అన్నారు. కాంగ్రెస్ ను దోషిని చేస్తు హరీష్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్మే చిన్నారెడ్డి తప్పుపట్టారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించని తెరాస ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టాలని అనుకుంటోందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు మండలాలు ఆంధ్రాప్రాంతంలోకి కలుపుతూ కేంద్రం నిర్ణయించినా ఎలాంటి స్పందనా తెలపలేదని కెసిఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. కేవలం కాంగ్రెస్ కారణంగానే తెలంగాణకు న్యాయం జరిగిందని వారు తెలిపారు. ఇలా టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ మధ్యలో అందుకున్నారు. ఏడు ముంపు మండలాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. ఏడు మండలాల విలీన అంశంపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రానికి కావలసిన హక్కులు సాధించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  assembly  bjp  congress  trs  

Other Articles