Teen girl gang raped by auto driver

teen girl gang raped by auto driver, teen girl gang raped by five in rangareddy, gang rape in maneguda, crime on women, gang rape on girl, crime in telangana, crime in Rangareddy district, Telangana police, gang rape accused arrested,

teen girl gang raped by auto driver in rangareddy district

యువతిపై అటో డ్రైవర్, అతని స్నేహితుల గ్యాంగ్ రేప్

Posted: 03/16/2015 02:39 PM IST
Teen girl gang raped by auto driver

అడపడచులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హెచ్చరికలను కూడా పక్కనబెట్టి కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని మన్నెగూడ ప్రధాన కూడలి వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ఓ అభాగినిని మాయమాటలతో అటోలో ఎక్కించుకున్న అటో డ్రైవర్.. తన స్నేహితులతో కలసి అమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి మన్నెగూడ కూడలి వద్ద బస్సుకోసం వేచి చూస్తున్న ఓ యువతిని సీలాపూర్కు చెందిన దానయ్య తన ఆటోలో ఎక్కించుకుని.. సురక్షితంగా ఇంటికి చేర్చుతానని నమ్మబలికాడు. అనంతరం తన నలుగురు స్నేహితులతో కలిసి స్థానికంగా వున్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అమె  దారుణానికి ఒడిగట్టాడు. అయితే యువతి కేకలు విన్న గ్రామస్తులు ...పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు వెంటనే స్పందించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మాల శ్రీనివాస్, ఎర్రవెల్లి భీమయ్య, దానయ్య, ఎర్రవెల్లి మల్లయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gang rape  manneguda  Rangareddy police  crime case  

Other Articles