Venkaiah naidu takes on congress on rahul issue

venkaiah naidu takes on congress, venkaiah naidu takes on congress on rahul inquiry issue, union minister venkaiah naidu, venkaiah naidu on rahul inquiry issue, venkaiah responds on rahul inquiry issue, venkaiah says advani, amitshah faced the same situation,

union minister venkaiah naidu takes on congress on rahul inquiry issue

మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా..?

Posted: 03/15/2015 05:48 PM IST
Venkaiah naidu takes on congress on rahul issue

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లి ఆయన గురించి వాకబు చేయడం దుమారం రేపడంతో ఈ ఘటనపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ అనవరసర విషయాలలో రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ చేస్తే తప్పు కాదు కానీ, బీజేపి అది చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిఘా వ్యవస్థలో భాగంగానే రాహుల్ ఇంటికి పోలీసులు వెళ్లారని తెలిపారు. గతంలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, అమిత్ షాలతో పాటు తమ ఇళ్లకు కూడా పోలీసులు వచ్చి ప్రశ్నించారని వెంకయ్య అన్నారు.
 
భూసేకరణ బిల్లులో మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు సూచనలను పరిగణలోకి తీసుకుని తొమ్మిది సవరణలను ప్రతిపాదించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతులకు మంచి చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకయ్య తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల వలన ప్రభుత్వం మారదని.. ప్రతిపక్షం బలంగా ఉండాలని వెంకయ్య సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  rahul gandhi  police inquiry  

Other Articles