Nun gangraped in kolkatta government orders probe

nun gangraped in kolkatta, 72 year old nun gangraped in kolkatta, dacoits gangraped nun, nun gangraped in west bengal, government orders cid probe in gang rape, cid to probe nun gangrape case, dacoits gang raped nun, dacoits gang raped 72 year old nun, dacoits looted 12 lakh ruppees,

72 year old nun gangraped in kolkatta by dacoits, weat bengal government orders cid probe

కోల్ కత్తాలో ధారుణం, నన్ పై గ్యాంగ్ రేప్..

Posted: 03/14/2015 07:55 PM IST
Nun gangraped in kolkatta government orders probe

కోల్ కత్తా లో దారుణం జరిగింది. దేశమంతా ఓ వైపు డాటర్ ఆఫ్ ఇండియా అంటూ నిర్భయ గ్యాంగ్ రేప్ బాధితురాలి గురించి చర్చించుకుంటున్న సమయంలోనే వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలోని నాడియా జిల్లా లో కామాందులు వృద్దురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాడియాలోని గంగ్నాపూర్ లో  72 సం.రాల  నన్ పై  సామూహిక  అత్యాచారం కలకలం సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం గత అర్థరాత్రి తరువాత  స్కూల్ లోకి చొరబడ్డ సుమారు  పన్నెండుమంది దొంగలు నన్ పై  సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను  దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.  ఈవార్త దావానలంలో వ్యాపించడంతో ఆగ్రహించిన  విద్యార్థులు ఆందోళనకు దిగారు.  స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.  
 
జిల్లా కలక్టర్  పీడీ సలీం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.  దోషులను  కఠినంగా శిక్షిస్తామన్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనగా ఆయన అభివర్ణించారు.  పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉందని నేరస్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని తగినవిధంగా  శిక్షిస్తామని  రాష్ట్ర  గ్రామీణాభివృద్ధి  శాఖామంత్రి  ఫిరాద్ హామీ  ఇచ్చారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 72 year old nun  gang raped  dacoits  

Other Articles