Modi wish to get honour equality for srilankan tamils in srilanka

pm modi, srilanaka, sirirsena, fisherman, tamils, development

modi wish to get honour, equality for srilankan tamils in srilanka. on srilanaka tour indian pm modi speech at srilanaka parliament. he wish to cooperate both srilanaka and india for development.

శ్రీలంక తమిళులకు గౌరవం, సమానత్వం దక్కాలి: మోదీ

Posted: 03/14/2015 09:11 AM IST
Modi wish to get honour equality for srilankan tamils in srilanka

శ్రీలంకలో మైనారిటీలైన తమిళ ప్రజలకు అన్ని రంగాల్లో సమానావకాశాలివ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి, ఐకమత్యంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తమిళులు సమానత్వం, న్యాయం, గౌరవంగా జీవించాలని భారత ప్రభుత్వం కోరుకుంటున్నది. మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాదంతో పోరాడి విజయం సాధించిన శ్రీలంక ఐక్యత, సమగ్రతే భారత్‌కు ముఖ్యం. ఇది మన ప్రయోజనాలకు వేరుమూలం లాంటిది. ఉగ్రవాదం, అంతర్యుద్ధంలో దశాబ్దాలపాటు నలిగిపోయిన శ్రీలంక తమిళులు గౌరవప్రదమైన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని శ్రీలంక ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఐక్యత, సమగ్రతతో శ్రీలంక సమ్మిళిత అభివృద్ధి సాధించాలని భారత్ కోరుకుంటున్నదని తెలిపారు. శ్రీలంక పర్యటనలో పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్న మోదీ, పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడారు.

జాలర్ల సమస్యపై రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకొనేందుకు భారత్, శ్రీలంక జాలర్ల సంఘాలు వీలైనంత త్వరగా సమావేశం కావాలి అని మోదీ పేర్కొన్నారు.  ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఐక్యత, మార్పు, సమైక్యత కోసం దేశ సమిష్టి గళానికి అద్దం పట్టాయని పేర్కొన్నారు. దశాబ్దాలపాటు శ్రీలంక తీవ్రమైన హింస, ఘర్షణలో మగ్గిపోయింది. ఉగ్రవాదాన్ని ఓడించి మీరు సమర్థంగా దానిని తుదముట్టించారు. హింసవల్ల గాయపడ్డ అన్నివర్గాల హృదయాలను గెలుచుకొనే చారిత్రక అవకాశం ఇప్పుడొచ్చింది అని తెలిపారు. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరులో భారత్-శ్రీలంక మధ్య సహకారం మరింత పెరుగాల్సి ఉందన్నారు. మన రెండు దేశాల భద్రత, శ్రేయస్సుకు హిందూ మహాసముద్రం కీలకమైనది. ఈ విషయంలో మనం కలిసి పనిచేస్తే లక్ష్యాలను మించి విజయాలు సాధిస్తాం అని మోదీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తమ దేశంలో పర్యటించటం ఆశీర్వాదంగా భావిస్తున్నామని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు.  

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm modi  srilanaka  sirirsena  fisherman  tamils  development  

Other Articles