Parliamentary affairs minister venkiah naidu review on ap on behalf of bifercation law

ap, specialstatus, venkiah naidu, parliament, bifercation, defcit, revenue, funds

parliamentary affairs minister venkiah naidu review on ap on behalf of bifercation law. the central ministers gatherd to discuss about the ap situation after the bifercation.

ఆ ఒక్కటి తప్ప అన్ని చర్చించిన వెంకయ్య నాయుడు

Posted: 03/14/2015 09:05 AM IST
Parliamentary affairs minister venkiah naidu review on ap on behalf of bifercation law

రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల అమలుకు తీసుకొంటున్న చర్యలపై కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పలువురు కేంద్ర మంత్రులతో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. విభజన చట్టంలోని వివిధ ప్రతిపాదనలకు సంబంధించిన పురోగతిని, తాజా పరిస్థితిని కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో వివరించినట్లు సమాచారం. విభజన చట్టానికి అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టుల అంశాన్నే తప్ప ఈ ఉన్నతస్థాయి సమీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన ప్రత్యేక హోదా, విభన తరువాతి మొదటి సంవత్సరంలో మొత్తం రెవెన్యూ లోటును భర్తీ చేయడం, రాజధాని నగర నిర్మాణ వ్యయాన్ని భరించడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చిన దాఖలాలే కనిపించలేదు. అలాగే, వెనుకబడిన ప్రాంతాల సత్వర, సర్వతోము ఖాభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ప్రకటించాల్సిన అంశం, పారిశ్రామికీరణను ప్రోత్సహించేందుకు వివిధ పన్ను రాయితీలు, పెట్టు బడి ప్రోత్సాహకాలను ప్రకటించే విషయం కూడా ఈ సమావేశంలో సమీక్షకు నోచుకోలేదు.

రాష్ట్ర విభజన పర్యవసానంగా తొలి ఏడాదిలో దాదాపు 16,500 కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్ర ప్రదేశ్‌ కష్టాల్లో ఉంది. ఏపిని ఆదుకునేందుకు  తొలి ఏడాది లోటు ను పూర్తిగా కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది మరో పదిహేను రోజుల్లో తొలి ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నా,  కేవలం 500 కోట్లను తాత్కాలిక సహాయంగా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మిగిలిన నిధుల విడుదల అంశాన్ని పూర్తిగా దాటవేస్తున్నట్లు కనిపిస్తోంది. విభజన చట్టం అమలు, రెండు రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టుల అమలుకు తీసుకొంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి  కేంద్ర మంత్రివర్గ సభ్యులైన దాదాపు 35మంది వరకూ పాల్గొన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  specialstatus  venkiah naidu  parliament  bifercation  defcit  revenue  funds  

Other Articles