Telanagana and andhra pradesh may get 2 million metrick standerd cubic meter gas

natural gas, gas, ap, telanagana, power, maharastra, rastriya chemicals, depatment of fertilizers

telanagana and andhra pradesh may get 2 million metrick standerd cubic meter gas: department of fertilizers allow to supply regasified liquid natural gas instead of kg-6d.

అదనంగా గ్యాస్.. తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం..!

Posted: 03/14/2015 09:25 AM IST
Telanagana and andhra pradesh may get 2 million metrick standerd cubic meter gas

తెలుగు రాష్ట్రాలకు అదనంగా గ్యాస్ లబించే అవకాశం వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరెంట్ కష్టాల నుండి కాస్త ఊరటలిభించేందుకు ఆస్కారం ఉంది. మహారాష్ట్రలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ యూనిట్లకు సరఫరా చేస్తున్న కేజి-డీ6 గ్యాస్ కు బదులుగా రీగ్యాసిఫైడ్ లిక్విడ్ నేచురల్ గ్యాస్ ను సరఫరా చెయ్యడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనుమతి లబించింది. దీంతో రోజుకు 2 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్ల గ్యాస్ తెలుగు రాష్ట్రాలకు అదనంగా అందనుంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు 450 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతాయి. ఈ విద్యుత్ లో తెలంగాణకు 242 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్ కు 208 మెగావాట్ల విద్యుత్ దక్క నుంది. ఫలితంగా ప్రస్తుతం తెలంగాణలో తీవ్రంగా కొరత ఉన్న విద్యుత్ కొంత తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూడా ప్రయోజన్ కలుగుతుంది.

ప్రస్తుతం విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణకు కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. 18.62 లక్షల పంపు సెట్లు కలిగి ఉన్న తెలంగాణ రైతులకు రబీ పంట దిగుబడిని కాపాడుకొనే వీలు చిక్కుతుంది. అంతేకాకుండా తెలంగాణలో విద్యుత్‌ కోతల సమస్య కొంతవరకు అధిగమించవచ్చు కూడా. తాజా నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రైతులకు కూడా ప్రయోజనం చేకూరడం ఖాయమే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో పనిచేస్తున్న ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్‌ సంస్థలు రిలయన్స్‌ గ్యాస్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కు చెందిన ఈస్ట్‌ వెస్ట్‌ పైప్‌లైన్‌తో అనుసంధానం అయి ఉన్నాయి. కాగా ఆర్‌ఎన్‌ఎల్‌జీ టెర్మినళ్లు దేశ పశ్చిమ కోస్తా తీరంలో నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలోని ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌తోనూ, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌, ఆర్‌జీటీఐఎల్‌లతో గెయిల్‌ లిమిటెడ్‌ అవసరమైన కాంట్రాక్చువల్‌ అగ్రిమెంట్‌లను కుదుర్చుకొంటుందని  ఒక ప్రకటనలో తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : natural gas  gas  ap  telanagana  power  maharastra  rastriya chemicals  depatment of fertilizers  

Other Articles