Ttdp mlas suspended for budget sessions in telanagana assembly

ttdp, assmbly, budget, revanthreddy, speaker, janareddy, harishrao,suspention

ttdp mlas suspended for budget sessions in telanagana assembly. assmbly speaker madhusudhanachary suspended ttdp mlas. minister harishrao propose to suspend the members of assmbly.

పది మంది టిటీడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

Posted: 03/09/2015 11:35 AM IST
Ttdp mlas suspended for budget sessions in telanagana assembly

తెలంగాణ అసెంబ్లీ నుండి తెలంగాణ టిడిపి సభ్యులను స్పీకర్ మధుసూధనచారి సస్పెన్షన్ చేశారు. బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యేంతవరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది. విపక్ష సభ్యుల సస్పెండ్ చేయాలని మంత్రి హరీష్ రావు తీర్మానం చేశారు.అంతకు ముందు  గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన గొడవలో జాతీయ గీతాన్ని అవమానించేలా, బెంచీలెక్కి నిరసన తెలిపిన సభ్యుల నుండి క్షమాపణ కోరినా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ డిమాండ్ ను తిరస్కరించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, గాంధీ, గోపినాథ్, సండ్ర, టి.ప్రకాశ్ గౌడ్, రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాయన్న, వివేక్ సస్పెన్షన్ కు గురయ్యారు. జాతీయ గీతాన్ని ఆలపించేపుడు సభ్యుల ప్రవర్తన విచారకరం అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.  శనివారం నాటి ఘటన దురదృష్టమని ఆయన అన్నారు. జాతీయ ఘీతాన్ని అవమానించిన సభ్యులు క్షమాపణ కోరాలని జానారెడ్డి కోరారు. అయితే శనివారం జరిగిన ఘటనకు సంబందించిన వీడియోను మళ్లీ పరిశీలించాలని, సభ ముందు పెట్టాలని జానారెడ్డి కోరారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. మరోపక్క కాంగ్రెస్ ఎమ్ముల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ సభలో జాతీయగీతాన్ని ఆలపిస్తున్నట్లు అసౌన్స్ చెయ్యలేదని వెల్లడించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttdp  assmbly  budget  revanthreddy  speaker  janareddy  harishrao  suspention  

Other Articles