Hot hot discussion is going on at telanagana assmbly

telanagana, assmbly, kcr, harishrao, akbaruddin, laxman, janareddy, sampathkumar

hot hot discussion is going on at telanagana assmbly. telanagana assembly speaker suspend the ttdp leaders, who misbehave while national song. kcr announce thet the govt ready to discuss any issue and any time.

తెలంగాణ సభా పర్వం.. వాడివేడి చర్చ

Posted: 03/09/2015 12:27 PM IST
Hot hot discussion is going on at telanagana assmbly

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని వీడియో పుటేజిలో చూపించలేదని,  ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తోంది  టిటిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఆరోపించారు.మరో పక్క శనివారం నాటి ఘటనపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. జాతీయగీతాన్ని ప్రతి ఒక్కర గౌరవించాలని, జాతీయగీతం ఆలపించని వారు దేశం వదిలిపోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. జాతీయ గీతాన్ని ఆలపించని వారిపై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చెయ్యడం మంచిది కాదని ఎమ్మెల్యే లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. శనివారం నాటి ఘటనకు సంబందించిన వీడియోను సభ ముందుంచాలని కోరారు. ఒక్క రోజు సస్పెండ్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

టీడిపి సభ్యులకు మూడు సార్లు అవకాశం ఇచ్చినా వారు వినియోగించుకోలేదు తెలంగాణ మంత్రి హరీష్ రావ్ అన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్,  ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సస్సెన్షన్ నుండి తప్పించుకున్నారు. హరీష్ రావు సంపత్ కుమార్ ను కూడా సస్పెండ్ చెయ్యలని సభాపతిని కోరుతుండగా, సంపత్ కుమార్ కొత్త సభ్యుడని కనుక అతడికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పీకర్ ను కోరారు. సంపత్ శనివారం నాటి ఘటనకు క్షమాపణలు చెప్పడంతో సస్పెన్షన్ నుండి తప్పించుకున్నారు.

అందరి సహకారంతోనే కొత్త రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం రోజున కూడా టిడిపి నేతలు నినాదాలు చేశారని తెలిపారు. జాతీయగీతాన్ని అవమానించడమే కాకుండా గవర్నర్ పై కాగితాలు విసిరారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని, అవసరమైతే సమావేశాలను పొడిగిద్దామని కెసిఆర్ ప్రకటించారు. జాతీయగీతాన్ని అవమానించిన వారు ఎవరైనా క్షమాపణలు కోరాల్సిందే అని ఆయన అన్నారు. సభను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, అయినా సభను నడిపితీరుతామని వెల్లడించారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులను ఎన్ని సార్లు సస్పెండ్ చెయ్యడానికైనా సిద్దమని ప్రకటించారు.తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని వెల్లడించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  assmbly  kcr  harishrao  akbaruddin  laxman  janareddy  sampathkumar  

Other Articles