Chandrababu naidu warned to rapists

ap assmbly, cm, chandrababu, rape, nirbhaya case

chandrababu naidu warned to rapists. in the ap assmbly sessions ap cm chandrababu naidu warned the rapists. in chittur dist a sc lady rape case. he suggest the police to file nirbhaya case on accuses.

వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు

Posted: 03/09/2015 11:00 AM IST
Chandrababu naidu warned to rapists


ఆడబిడ్డలపై అఘాయిత్యాలు సహించం..వార్నింగ్ ఇస్తున్నాఅంటూ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంసందర్భంగా చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ ఎస్సీ మహిళపై కొందరు వ్యక్తులు మానభంగం చేసి హత్య చేశారనే సమాచారం వచ్చిందని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లో నిందితులను పట్టుకోవాలని, ముప్పై రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందని సభలో తెలిపారు. అంతేగాకుండా వారిపై నిర్భయ కేసు పెట్టాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే మృతి చెందిన బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్ కు చెప్పడం జరిగిందన్నారు. అత్యాచార కేసుల్లో వేరే వారు భయపడే విధంగా తాను చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap assmbly  cm  chandrababu  rape  nirbhaya case  

Other Articles