Pm narendra modi salutes women s indomitable courage

PM Narendra Modi salutes women’s indomitable courage, Modi salutes women’s indomitable courage, PM Narendra Modi on women’s day, Modi tweets on women’s day, center to start helplines for women, one-stop- centres and mobile helplines for woman, Prime Minister Narendra Modi

Denouncing the violence against women, Prime Minister Narendra Modi on Sunday said one-stop- centres and mobile helplines will be set up for women in distress.

మహిళల రక్షణకు కేంద్రం ప్రత్యేక హెల్ప్ లైన్..

Posted: 03/08/2015 09:48 PM IST
Pm narendra modi salutes women s indomitable courage

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హింసను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడల్లా సిగ్గుతో తల దించుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా తామ ప్రభుత్వం మహిళల రక్షణకై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

మహిళల సమస్యలకు ఒకే చోట నుంచి పరిష్కారం చూపించే విధానం తీసుకొస్తామని, అలాగే ఆపదలో ఉన్న మహిళలకు మొబైల్ ద్వారా సహాయం చేసే ఏర్పాట్లు చేస్తామన్నారు. మనమంతా కలిసి ముందుకు సాగుతూ మహిళలకు జరిగే అన్యాయాలకు స్వస్థి పలకాల్సిన అవసరం ఉందన్నారు.  "మన దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను కూడా మనతో తీసుకెళ్తూ వారికి సమానత్వాన్ని అందిస్తామని మనం ఈ రోజు కొత్తగా ప్రతిజ్ఞ చేయాలి. తమ ప్రభుత్వ హయాంలో మహిళల జీవితాలకు సానుకూలమైన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని'  మోదీ ఈ సందర్బంగా వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  International women's day  helplines  

Other Articles