Ap cm chandrababu naidu on central govt

ap. specilastatus, budget, centralgovt, chandrababu, ap cm, japan

ap cm chandrababu naidu express his disappointment on central govt. the bjp party is failing to support ap fully. in the new central budget ap didnt get sufficient fund for ap.

కేంద్రం నుండి మొండిచేయి: చంద్రబాబు

Posted: 03/09/2015 08:51 AM IST
Ap cm chandrababu naidu on central govt

ఏపి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి తగినన్ని నిధులు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అరకొర నిధులతో సరిపెట్టడంతో రాష్ట్రం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటోందని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం, సాగు, తాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుండి నిధులు అనుకున్న స్థాయిలో నిధులు అందడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన హామీలు నెరవేర్చడం లేదని. కేంద్ర  బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధుల కేటాయింపులు జరగలేని తెలిపారు. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు.

జపాన్ ప్రతినిధులు పరిశ్రమల స్థాపనకు సిద్దంగా ఉన్నారని, కృష్ణపట్నం పోర్టు,  తీరప్రాంత కారిడార్‌ను పరిశీలించారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి నిధులు లేవని, అందుకు గాను  ప్రైవేటు పెట్టుబడుల వైపు చూడాల్సి వస్తోందని అన్నారు. తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. త్వరలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap. specilastatus  budget  centralgovt  chandrababu  ap cm  japan  

Other Articles