Isis spreads while useing twitter

isis, twitter, tweets, supporters, soudiarebia, jm berger, morgan, report

A report into Twitter accounts that support the self-proclaimed Islamic State of Iraq and al-Sham (ISIS) has revealed that Twitter has at least 46 thousand pro-ISIS accounts, with the actual number believed to be much higher.

ట్విట్టర్ వేదికగా ఐఎస్ఐఎస్ ప్రచారం

Posted: 03/07/2015 11:53 AM IST
Isis spreads while useing twitter

ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్. బందీలను అతికిరాతకంగా నరికి చంపి, ఆ వీడియోలను నెట్ లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సంస్థ. మనుషుల నెత్తుటి రుచి మరిగిన ఐఎస్‌ఐఎస్‌ ఇపుడు సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది. ఐఎస్ఐఎస్ మద్దతు దారుల్లో 46 వేల మందికి 2014లో ట్విట్టర్ అకౌంట్లు వుండటమే ఇందుకు నిదర్శనం. ఐఎస్ఐఎస్ మద్దతు దారులు 2014 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య 46వేల ట్విట్టర్ అకౌంట్లను వినియోగించినట్లు తేలింది. ఐతే ఇవన్నీ ఒకే సమయంలో యాక్టివ్‌గా లేవని ఈ అంశంపై అధ్యయనం చేసిన జేఎం బెర్గర్, జోనాథన్ మోర్గాన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ రిపోర్టును వాషింగ్టన్‌లో తాజాగా విడుదల చేశారు.2014 సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు 46 వేల నుండి 70 వేల ట్విట్టర్ అకౌంట్లలో ఐఎస్ఐఎస్ గురించి ట్వీట్లు చేశారు.

ఐఎస్ఐఎస్‌కు మద్దతుగా ట్విట్టర్ అకౌంట్లు కలిగిన వారిలో ఎక్కువ మంది సౌదీఅరేబియాకు చెందిన వారు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. తర్వాత స్థానాల్లో సిరియా, ఇరాక్, యూఎస్‌లకు చెందిన వారు ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంగ్లీష్‌లో ట్వీట్లు పోస్ట్ చేస్తుండగా, ఎక్కువ మంది తమ పోస్ట్ లను అరబిక్‌లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్‌ కలిగిన ఐఎస్ఐఎస్ మద్దతుదారుల్లో ప్రతి ఒక్కరికి వెయ్యిమందికి పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. ప్రపంచం మొత్తం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఐఎస్ఐఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా యువతను ఆకట్టుకోవటంపై దృష్టి పెట్టింది.  తాజాగా విడుదలైన రిపోర్ట్ అన్ని దేశాలకు వణికుపుట్టిస్తోంది. అసలే ఆ సంస్థ చేస్తున్న దాష్టికాలను తట్టుకోలేపోతున్న దేశాలు, మరి కొంత మంది అదే బాటలో నడుస్తుండటంపై భయపడుతున్నాయి. అయితే ఐఎస్ఐఎస్ ఆగడాలను ఎలా అరికట్టాలా అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  twitter  tweets  supporters  soudiarebia  jm berger  morgan  report  

Other Articles