Venkaiah naidu appeal to opposition to cooperate

Venkaiah Naidu, Parliamentary, govt, development, modi, land pooling, rajyasabha, loksabha, infrastructure

Parliamentary affairs minister M Venkaiah Naidu said the measures were part of the government's efforts for a push for development" initiated by Prime Minister Narendra Modi.

బాబ్బాబు.. సహకరించండి.. ప్రతిపక్షాలకు వెంకయ్య వేడుకోలు

Posted: 03/07/2015 11:33 AM IST
Venkaiah naidu appeal to opposition to cooperate

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. ప్రభుత్వానికి లోకసభలో భారీ మెజారిటీని కలిగిన భారతీయ జనతా పార్టీ, మిత్ర పక్షానికి బలం లేకపోవడంతో అనుకోని విధంగా ఝలక్ ఇచ్చాయి ప్రతిపక్షాలు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి సవరణలు చెయ్యాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం సవరణలకు ముందుకు రాకపోవడంతో, ఓటింగ్ తప్పని సరైంది. అయితే రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో తీర్మానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అలా ప్రతిపక్షాల చేతిలో దెబ్బతిన్న ప్రభుత్వం ముందు తీసుకువచ్చే బిల్లులను ఆమోదింపజేసేలా చర్యలు ప్రారంభించింది.

ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులకు, ప్రతిపక్షాలు అడ్డుతగలకుండా చూసుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎమ్. వెంకయ్య నాయుడు ప్రతిపక్షాల నాయకులకు ఓ విన్నపం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించే మార్గలకు అడ్డుతగుతోందని అన్నారు. ప్రభుత్వం ఎంతో ఉన్నతంగా అందరి అభివృద్దికి కృషి చేస్తోందని, అందులో భాగంగా చేసే కీలక చట్టాల బిల్లులకు అడ్డుతగలవద్దని కోరారు. భూసేకరణ చట్టంలో మార్పులకు ప్రభుత్వం సూచన ప్రాయంగా ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్దికి సహకరించాలని కోరారు. 1894 నుండి 2013 వరకు భారతదేశంలో భూసేకరణ జరిగిందని, ఇప్పుడు మాత్రం భూసేకరణపై అపోహలు కల్పిస్తున్నారని వెంకయ్య విమర్శంచారు. ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులకు చేపడుతోందని, అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని అనుకుంటోందని, అందుకు గాను భూములు అవసరమని తెలిపారు. భూమి లేకుండా ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరగవని వెల్లడించారు. కాబట్టి అన్ని పక్షాలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాయని భావిస్తున్నానని వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  Parliamentary  govt  development  modi  land pooling  rajyasabha  loksabha  infrastructure  

Other Articles