Won t leave congress party says komatireddy venkatareddy

won't leave congress party says komatireddy venkatareddy, nalgonda mla komatireddy venkat reddy, venkatareddy trashes new party comments, comments of new party are made by revanth reddy, revanth reddy comments on new party, political Joint action commitee chairman kodandaram reddy, professor kodandaram

won't leave congress party says komatireddy venkatareddy trashes new party comments

కాంగ్రెస్ ను వీడను..కొత్త పార్టీ పెట్టను..

Posted: 03/07/2015 10:46 AM IST
Won t leave congress party says komatireddy venkatareddy

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షలను ఎంపిక చేయడంలో రెండో పర్యాయం కూడా తప్పు చేసిందని...అతనికి సహకరించబోనని  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బహిరంగానే విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ... కాంగ్రెస్ పార్టీని వీడి.. కొత్త పార్టీ ఏర్పాటు చేయడం విషయమై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తానకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో వున్నవి వ్యక్తిగత సమస్యలే తప్ప.. రాజకీయ తగాదాలు లేవన్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు మర్యాదపూర్వకంగా తనను లాభీలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పిచ్చాపాటి సందర్భంగా తాను వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలు సత్యదూరమన్నారు. అయితే తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ నాయకత్వాన కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అన్నారనన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం నేపథ్యంలో కోదండరామ్ రెడ్డి నాయకత్వంలో పార్టీని స్థాపించాలని రేవంత్ వ్యాఖ్యానించారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని విడుతానన్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వెంకటరెడ్డి చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : komatireddy venkatareddy  revanth reddy  congress  new party  

Other Articles