Governor narasimhan speech in andhra pradesh assembly

Ap assembly buget sessions, governer speech in AP assembly, Telugu states Assembly budget sessions begins today, Telugu states Assembly budget sessions from today, Telangana Assembly budget sessions begins today, Andhra pradesh Assembly budget sessions begins today, Andhra pradesh Assembly budget sessions from today, ap budget session, governor speech, andhra pradesh assembly,Telugu desam party, TDP, YSRCP, TRS, Congress party, BJP, CPI,

governor narasimhan speech in andhra pradesh assembly

2029 నాటికి ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: గవర్నర్

Posted: 03/07/2015 09:57 AM IST
Governor narasimhan speech in andhra pradesh assembly

ఆగ్నేయ ఆసియాకు నవ్యాంధ్రప్రదేశ్ ను సింహద్వారంగా తీర్చిదిద్దుతామని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. నూతన రాష్ట్రాంలో రాజధాని నగర నిర్మాణ మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం విశ్వాసం ఉండాలన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం తప్పనిసరి నరసింహన్ అన్నారు.

రాష్ట్రంలో 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నాం. ముకుళిత హస్తాలతో ప్రార్థించినా... కేంద్రం నుంచి తగిన సాయం అందలేదన్ని చెప్పారు. ఏపీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి మరింత సహకారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అన్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల ఏపీకి మరింత నష్టం జరిగిందన్నారు.

9 నెలలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2029 నాటికి  దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే తమ లక్ష్యమన్నారు. కేంద్ర బడ్జెట్‌లోని కొద్దిపాటి మార్పులకు నిరుత్సాహపడకుండా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని గవర్నర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.100 కోట్ల స్వల్ప మొత్తం కేటాయించడం రాష్ట్ర ప్రణాళికకు భంగం వాటిల్లిందన్నారు. అశాస్త్రీయంగా, హడావుడిగా విభజించడం వల్ల ఏర్పడిన నష్టాలను కేంద్రానికి వివరించామన్నారు. విభజన తర్వాత ఏపీ ప్రధాన వనరులను పోగొట్టుకుందన్నారు. రైతు రుణవిముక్తి రెండో దశ లబ్ధిదారులను ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధి ఎజెండాను ముందుకు తెచ్చామన్నారు.

గవర్నర్ నరసింహన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

*విజన్ 2050 డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నాం
*2029 నాటికి ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది మా తపన
*మన అభివృద్ధి విజన్‌లో కేంద్రం సాయపడుతుందని ఆశిస్తున్నాం
*ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.90,517తో సంతృప్తికరంగా ఉంది
*14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఏపీకి ప్రాధాన్యమేదీ లేదు
*నిధుల విషయంలో కేంద్రం నుంచి అనుకూల స్పందన ఇంకా అందవలసి ఉంది.
* హుద్హుద్ సహాయంగా ప్రధాని ప్రకటించిన రూ.1000 కోట్లలో రూ.650 కోట్లు విడుదలయ్యాయి.
* ప్రణాళికేతర రెవిన్యూ లోటు భర్తీ కోసం రూ.500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది
* 7 వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.350 కోట్లు
* 14వ ఆర్థిక సంఘ సిఫార్సులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదు
* కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినంత మేలు జరగలేదు
* రెవిన్యూ నిధులు ఉన్నా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం హాని కలిగిస్తుంది
* బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడాలంటే కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి
* ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ అభివృద్ధి, ఎజెండాతో ముందుకు సాగుతున్నాం
* విజన్-2050 డాక్యుమెంట్లు రూపొందిస్తుంది.
* 2029 నాటికి ఏపీని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఎజెండా
* స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు పేరుతో కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది
* అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
*2015-16 లోగా నాలుగు ఓడరేవులు
* వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
* ఆదివాసీల కోసం గిరిపుత్రిక కల్యాణ పథకం
* ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2018నాటికి పోలవరం పూర్తి
*రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు.
*నదుల అనుసంధానానికి ప్రాధాన్యత
* రాష్ట్రాన్ని ఆక్వా కేపిటల్గా మార్చుతాం
* కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కట్టుబడి ఉన్నాం.
*అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం
* రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly budget sessions  Andhrapradesh  Governer Narasimhan  

Other Articles