నాగాలాండ్ కు చెందిన ఓ మహిళను ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే ఓ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఎక్కువ సంఖ్యలో జనాలు పోగయ్యారు. కస్టడీకి తరలించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే నిందితున్ని కఠినంగా శిక్షించాలని సుమారు నాలుగువేల మంది జైలుపై దాడికి చేశారు. జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్ఖాన్ను బయటికి తీసుకొచ్చారు. నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ నగరంలోని సిటీ టవర్ వరకూ ఈడ్చుకెళ్లారు, అక్కడే ఉన్న పది వాహనాలకు నిప్పంటించారు. కసితో ఉన్న ప్రజలు నిందితున్ని తీవ్రంగా కొట్టి చంపేశారు
ఇది కాస్తా రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు అవకాశమున్న నేపథ్యంలో నాగాలాండ్,అసోంలో కేంద్రం హైలర్ట్ ను ప్రకటించింది. కేంద్ర రెండు రాష్ట్రాల డిజిపిల నుండి వివరణ కోరినట్లు సమాచారం. మరో పక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేధించాలని హోంమంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. నాగాలాండ్ యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగా ప్రజలు ఘటనపై తీవ్రంగా స్పందించే అకాశాలున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగనున్నట్టు గ్రహించిన కేంద్రహోంశాఖ భారీ భద్రతాదళాలను రంగంలోకి దింపింది. ఘటనతో నాగాలాండ్, అసోం రాష్ర్టాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more