Governor narasimhan speech in ap both houses

ap. assembly, governor, narasimhan, specialstatus

governor narasimhan speech in ap both houses. ap facing many problems and the central govt must help the ap. the central govt did not coperate the ap. govner exhibite the ap govt goals.

ఏపిని నెంబర్ వన్ గా నిలుపుతాం.. నరసింహన్

Posted: 03/07/2015 10:11 AM IST
Governor narasimhan speech in ap both houses

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఏపిలొ చాలా ఇబ్బందులు ఉన్నాయని, కేంద్రం రాష్ట్రానికి సహాయం చెయ్యాల్సి ఉందని వెల్లడించారు. అయితే కేంద్ర నుండి అనుకున్నంత సహాయం అందడం లేదని తెలిపారు.మిగిలిన రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అని ఆయన అన్నారు. 2029 నాటికి  దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే తమ లక్ష్యమన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయటం తమ  విభజన వల్ల జరిగిన నష్టాలను గత అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించామన్నారు.  రాజధాని నిర్మాణంలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉండాలన్నారు.  జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..

*2029 నాటికి  దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే లక్ష్యం
*నిధుల విషయంలో కేంద్రం నుంచి అనుకూలగా స్పందచవలసి ఉంది.
* బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడాలంటే కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి
* ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ అభివృద్ధి, ఎజెండాతో ముందుకు సాగుతున్నాం.
* ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2018నాటికి పోలవరం పూర్తి
* 14వ ఆర్థిక సంఘ సిఫార్సులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదు
* కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినంత మేలు జరగలేదు
* హుద్హుద్ సహాయంగా ప్రధాని ప్రకటించిన రూ.1000 కోట్లలో రూ.650 కోట్లు విడుదలయ్యాయి.
* ప్రణాళికేతర రెవిన్యూ లోటు భర్తీ కోసం రూ.500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది
* ఏడు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.350 కోట్లు కేంద్ర నుండి వస్తున్నాయి.
* విజన్-2050 డాక్యుమెంట్లు రూపొందిస్తుంది.
* స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు పేరుతో కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది
* అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
*2015-16 లోగా నాలుగు ఓడరేవులు అఢివృద్ది చేస్తాం.
* రాష్ట్రాన్ని ఆక్వా కేపిటల్గా మార్చుతాం
* వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
*అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం
* ఆదివాసీల కోసం గిరిపుత్రిక కల్యాణ పథకం
*రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు.
*నదుల అనుసంధానానికి ప్రాధాన్యత
* కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కట్టుబడి ఉన్నాం.
* రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదలు

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap. assembly  governor  narasimhan  specialstatus  

Other Articles