Retired army man made way for an ambulance cop thrashed him

Retired Army Man Made Way For Ambulance, Retired Army Man samaritan, Benguluru Traffic sub-inspector Ranganna, Cops thrashed Retired Army Man, sub-inspector Ranganna austerity, sub-inspector Ranganna manhandling ex serviceman, si Ranganna sternness to sr citizens,

Benguluru Traffic sub-inspector Ranganna is caught in controversy for manhandling an ex serviceman.

మానవత్వం పరిమళించింది.. కాకీ కాఠిన్యం శిక్షించింది..

Posted: 03/04/2015 11:05 AM IST
Retired army man made way for an ambulance cop thrashed him

వెనక నుంచి వస్తున్న ఆంబులెన్స్ శబ్దం చేస్తూ వస్తోంది. అందులో వున్న పేషంట్ అతని అటెండెంట్స్.. ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తీవ్రంగా వుంది. చావు బతుకులు మధ్య ఊగిసలాడుతున్న ఓ ప్రాణాని కాపాడేందుకు నడుంచుట్టాడు పదవీ విరమణ చేసిన ఓ మాజీ సైనికుడు. అతనిలోని మానవత్వం పరిమళించింది. అందరిలా తన పని తాను చేసుకోకుండా.. తాను నడుపుతున్న సైకిల్ ను పక్కన బెట్టి.. ఆంబులెన్స్ ట్రాపిక్ జామ్ లోంచి బయటపడేందుకు అడ్గుగా వున్న బ్యారికేడ్లను పక్కకు తీసి దారిని కల్పించాడు.

అంతే మాజీ సైనికుడి నాగప్పపై కాకీ కాఠిన్యం విరుచుకుపడింది. ఆయన చేసిన మంచి పనికి స్వాగతించాల్సింది పోయి.. తన వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ రంగన్న నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డాడు. మాజీ  సైనికుడు నాగప్పను పట్టుకుని చితకబాదాడు.  రెచ్చిపోయారు. ఆ సమయంలో కొందరు ఎస్ఐకి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఈ ఘటన నిన్న కర్నాటకలోని బెంగుళూరు కావేరి జంక్షన్ లో చోటుచేసుకుంది. దీనిని మీడియా తన కెమెరాలో బంధించడంతో కాకీల కాఠిన్యం బయటపడింది.

ఈ ఘటనపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐ రంగన్న తప్పు చేశాడని, తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు అంబులెన్స్ కు దారి ఇవ్వడం ప్రతి ఒక్క పోలీసు, పౌరుడి కర్తవ్యం అని అన్నారు. నగరంలో అంబులెన్స్ సవ్యంగా వెళ్లడానికి అన్ని ఎర్పాట్లు చేస్తామని చెప్పారు. మాజీ సైనికుడు నాగప్ప మీద దాడి చేసిన ఎస్ఐ రంగన్నను సస్పెండ్ చేస్తున్నామని ఎం.ఎన్. రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా మాజీ సైనికుడు నాగప్ప చేసిన మంచి పనిని, అతనిలోని మానవత్వానికి ఇప్పడు దేశవ్యాప్తంగా సెల్యూట్ లు వెల్లివిసుర్తున్నాయి.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Benguluru  si Ganganna  manhandling  ex serviceman nagappa  

Other Articles