Congress high command s wrong desision

congress high command's wrong desision, Telangana pradesh congress committee, wont support uttam kumar reddy, Tpcc president uttam kumar reddy, nalgonda mla komati reddy venkatareddy, voices raise against Tpcc president, ponnala lakshmaiah

congress high command's wrong desision, i wont support to uttam kumar reddy says komati reddy venkatareddy

ఉత్తమం కాదది.. తప్పుడు నిర్ణయం.. ఎలా సహకరిస్తాం..

Posted: 03/04/2015 01:20 PM IST
Congress high command s wrong desision

సార్వత్రిక ఎన్నికలలో ఓటమి నుంచి కాంగ్రెస్ అధిష్టానంపై పార్టీ నేతల రుసరుసలు క్రమంగా వినిపిస్తూనే వున్నాయి. ఈ సారి ఆ భాటలో పయనించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికలో అధిష్టానం మరోమారు తప్పు చేసిందని ఆయన విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియామకంతో ఈ విషయంలో మరోమారు అధిష్టానం తప్పు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో  మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ సంక్షోభ సమయంలో అందరినీ కలుపుకోగలిగే సమర్థవంతమైన నాయకుని కోసం అన్వేషించకుండా ఉత్తమ్ నియామకంపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సహకరించబోనని ఆయన తేల్చి చెప్పారు. సీనియర్లతో చర్చించకుండా అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిప్డారు. గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఈ పదవిలో నియమించి మొదటి తప్పు చేసిన అధిష్టానం.. ఉత్తమ్‌ను నియమించి రెండోసారి తప్పు చేసిందన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana pcc  UttamKumar Reddy  KomatiReddy Venkata Reddy  

Other Articles