Kejriwal quit from aap convenor post

kejriwal, aap, convenor, prashanthbhushan, yagendra, delhi

kejriwal quit from aap convenor post. prashanth bhuashan who is one of the aap founders letter cost aap convenor post for arvind kejriwal. kejriwal quit his post and decided to serve as a cm for delhi only.

ఆప్ కన్వీనర్ గా కేజ్రీవాల్ రాజీనామా

Posted: 03/04/2015 01:06 PM IST
Kejriwal quit from aap convenor post

ఆమ్ ఆద్మీ పార్టీలో వివాదాలకు తెర దించుతూ కేజ్రీవాల్ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ సిద్దాంతానికి రూపం ఇస్తూ, ఆప్ పార్టీ కన్వీనర్ పోస్టుకు రాజీనామా చేశారు. ఢిల్లీ ప్రజలకు తన సేవలను అంకితం చెయ్యాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారని కేజ్రీవాల్ దగ్గరి వారంటున్నారు. ప్రశాంత్ భూషణ్ గత రెండు రోజుల క్రితం రాసిన లేఖ తీవ్ర దుమారాన్ని రేపింది. పార్టీ స్థాపించే సమయంలో అనుకున్న వాగ్దానాలను ప్రస్తుతం పాటించడం లేదని, వాటి వల్ల తీవ్రంగ నష్టం కలుగుతుందని ప్రశాంత్ భూషణ్ అందులో వివరించారు. అయితే యోగేంద్ర యాదవ్ తో కలిసి పార్టీలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాసిన లేఖ పార్టీలోనూ తీవ్ర దుమారాన్ని రేపింది.

మొత్తానికి ఢిల్లీ సిఎంగా మాత్రమే కొనసాగాలని, పార్టీ పదవికి దూరంగా ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ రోజు జరగబోయే పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడతాయో అని ఆసక్తి నెలకొంది. మరోపక్క పార్టీ సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించారు. ప్రశాంత్ భూషణ్ కు వ్యతిరేకంగా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందునే ఇలా సమావేశానికి దూరంగా ఉన్నారని ఆరోపణ వినిపిస్తోంది. మరో పక్క పార్టీ తరఫున మంచి వార్త సాయంత్రం వరకు వినే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో కొంత మందితో పాటు, బయటి నుండి కూడా కేజ్రీవాల్ రెండు పదవులను చేపట్టడంపై విమర్శలు పెరుగుతుండటంతో, ఆప్ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారని సమాచారం. అయితే ఆప్ లో ముదిరిన వివాదాలు ఎలాంటి పరిష్కారం దిశగా వెళతాయో ఈ సాయంత్రానికి గానీ తేలదు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  aap  convenor  prashanthbhushan  yagendra  delhi  

Other Articles