Surpeme court took gangrape case as sumoto

the surpeme court took gangrape case as sumoto. the supreme court order to interagate the gangrape case by cbi. sunithakrishanan who is the social worker, wrote a letter to supreme court judge with video evidance.

surpeme court took gangrape case as sumoto

ఆ వీడియోపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం.. మార్చి 13న విచారణ

Posted: 02/28/2015 11:06 AM IST
Surpeme court took gangrape case as sumoto

వాట్సప్‌లో వచ్చిన గ్యాంగ్ రేప్ కు సంబందించిన వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ రాసిన లేఖను సుమోటో పిటిషన్‌గా సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆమె పెన్‌డ్రైవ్‌లో రెండు వీడియోలను పెట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తుకు లేఖ రాశారు. ఫిర్యాదును, వీడియోలను పరిశీలించిన అనంతరం లైంగికదాడి ఘటన అమానుషం, అత్యంత భయంక రం అని కోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక లైంగికదాడి ని సహించేది లేదని కోర్టు వెల్లడించింది. సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఆ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని  సీబీఐని  ఆదేశించింది.

ఈ వీడియో వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, ఐటీశాఖతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ రాష్ర్టాలకు నోటీసులు జారీచేసింది. మార్చి 13వ తేదీన ఈ కేసు విచారణను ధర్మాసనం చేపట్టనున్నది. 4.5 నిమిషాల వ్యవధి ఉన్న వీడియోలో బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడతుండగా మరో యువకుడు చిత్రీకరిస్తున్నట్లు కనిపించింది. 8.5 నిమిషాల వ్యవధి ఉన్న మరో వీడియోలో బాలికపై ఐదుగురు యువకులు కెమెరాకు నవ్వుతూ పోజు ఇవ్వడం, జోకులు వేయడం, ఒక్కొక్కరు బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడుతున్న వ్యవహారాన్ని కెమెరాలో షూట్ చేయడం రికార్డు అయింది. ఈ వీడియోలు దేశవ్యాప్తంగా వాట్సప్ ద్వారా వేగంగా చేతులు మారింది. లైంగికదాడికి సంబంధించిన వీడియోలు తన దృష్టికి రావడంతో సునీతా కృష్ణన్ వెంటనే యూట్యూబ్‌లో ఇటీవల పోస్ట్ చేశారు. నేరస్థులను పట్టుకోవడం కోసం సహాయం అందించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదని సునీతా కృష్ణన్ అన్నారు. మొత్తానికి సుప్రీం కోర్టు జోక్యంతో ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  hl dattu  sunithakrishnan  telangana  ganagrape  whatsapp  social media  

Other Articles