Union budget introduced by arunjailty

Prime Minister Narendra Modi's government is set to reveil its first full budget. a day after announcing the time was ripe for long-awaited reforms to kickstart the economy. finance minister Arun Jaitley met President Pranab Mukherjee, who was himself a finance minister, and was also presenting at the customary meeting of the cabinet, presided over by Prime Minister Narendra Modi inside Parliament House.

union budget introduced by arunjailty

పేదరిక నిర్మూలనే మా ప్రభుత్వ ధ్యేయం: అరుణ్ జైట్లీ

Posted: 02/28/2015 11:37 AM IST
Union budget introduced by arunjailty

ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జుట్ ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వం అని అన్నారు. సామాన్యుడికి మేలు చేసేలా తమ బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్రాల ప్రాధాన్యత గురించి వివరించారు. అన్ని రాష్ట్రాలకు అభివృద్దిలో భాగస్వామ్యం ఉందని, రాష్ట్రాలకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు.  విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయని జైట్లీ తెలిపారు. దేశం ఎన్నో సవాళ్లను అధిగమించిందని అన్నారు. తమ చర్యల కారణంగా ద్రవ్యోల్బణం 5.1 కి తగ్గిందని పేర్కొన్నారు.

ప్రపంచంలో ఇండియాను మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గా మారుస్తామని జైట్లీ తన ప్రసంగంలో వివరించారు. నిరంతర విద్యుత్ సాగు, తాగునీరు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.పేదరిక నిర్మూలన ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్షమని,  2022 లోగా పేదరికాన్ని నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.  సంక్షోభాన్ని అధిగమించేందుకు కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని అన్నారు. పెట్టుబడులకు భారత్ అనువైన దేశంగా మారిందని, ఇదంతా మోదీ ప్రభుత్వ ఘనత అని చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం పరుగులెత్తించిందని అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : budget  arunjailty  pmmodi  ndagovt  crisis  inflation  poverty  cooperative  makeinindia  

Other Articles