Bse sensex jumped over 250 point

BSE Sensex, budget, jaitly, nifty, sharemarket, economy, infrastructure

On Saturday morning, the BSE Sensex jumped over 250 points in morning trade. But, analysts warn that equity markets could see a sell off of 6-8 per cent if the Budget is short on pro-growth measures.

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 250 పాయింట్లు లాభపడ్డ బిఎస్ఇ

Posted: 02/28/2015 10:47 AM IST
Bse sensex jumped over 250 point

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. గత రైల్వే బడ్జెట్ లో భారీ మార్పు కారణంగా నేటి సాధారణ బడ్జెట్ పై ఇన్వెస్టర్లు భారీ ఆశలను పెట్టుకున్నారు. అరుణ్ జైట్లీ తీసుకుంటున్న నిర్ణయాలు, గత బడ్జెట్ కి కాస్త భిన్నంగా మోదీ మార్క్ తో ఈ బడ్జెట్ వస్తుందని మార్కెట్లు ఆశాభావంతో ఉన్నాయి. అందుకే భారత మార్కెట్లు ప్రారంభం నుండి మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 250 లాభపడింది. నిఫ్టి కూడా లాభాల బాటలో నడుస్తోంది. ఈ బడ్జెట్ లో భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తుందని, ప్రభుత్వం ఆ దిశగా తన బడ్జెట్ ను రూపొందించిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

1990 లో జరిగిన ఆర్థిక సంస్కరణల స్థానంలోనే మరిన్ని సంస్కరణల దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విదేశీ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే, స్వదేశీ పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. పివి నరసింహ రావు ప్రధానిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలు కీలక మార్పులకు కారణమైంది. భారత్ ఒక్క సారిగా అభివృద్ది వైపుకు వేగంగా పరుగులు తీసింది. ఇప్పుడు కూడా అలానే జరగబోతోందని ఊహ. అందుకే స్టాక్ మార్కట్లు ఉదయం నుండే లాభాలను గడిస్తున్నాయి. మొత్తానికి బడ్జెట్ స్టాక్ మార్కెట్లను ఏ తీరానికి చేర్చుతుందో వేచి చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  budget  jaitly  nifty  sharemarket  economy  infrastructure  

Other Articles