Damodara sensational words on police trs

damodara, damodararajanarasimha, congress leader, police, trs,

damodara sensational words on police, trs. depty. cm, congress senior leader warn to the police and trs leaders. some congress leaders complaint about the trs, police to damodara. damodara fired in that issues.

గుడ్డలూడదీస్తానంటూ.. దామోదర సంచలన వ్యాఖ్యలు

Posted: 02/28/2015 10:26 AM IST
Damodara sensational words on police trs

ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అన్నారో, గుడ్డలూడదీసి కొడతా అన్న డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ రామయ్యావస్తవయ్యా సినిమాలో ఈ డైలాగ్ వాడాడు. హీరో కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ రాజకీయాల్లో మాత్రం అలా కుదరదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తన వాళ్ల జోలికి వస్తే పొలీసులను గుడ్డలూడదీస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే దామోదర రాజనరసింహేనా ఈ వ్యాఖ్యలు చేసింది అన్న సందేహం చాలా మందికి కలిగుతోంది. అసలు ఆయన ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గత కొంత కాలంగా టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని  కొందరు కార్యకర్తలు మదామోదర రాజనరసింహతో ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మాటలపై స్పందించిన ఆ నేతామణి ఏకంగా తమ కార్యకర్తల జోలికి వస్తే గుడ్డలూడదీస్తా అని హెచ్చరించారు. అయినా ఇన్నాళ్లు నోట్లో నాలుక కూడా ఉందా అన్నట్లు వ్యవహరించిన దామోదర రాజనరసింహ ఉన్నట్లుండి ఒక్కసారి ఇలా హెచ్చరికలు జారీ చెయ్యడంపై చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మెదక్ లో ఓ పెళ్లికి వెళ్లిన ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : damodara  damodararajanarasimha  congress leader  police  trs  

Other Articles